×
Ad

Savitri : అహంతో మహానటి సావిత్రిని కోర్టు వరకు లాగిన వ్యక్తి.. దానివల్ల ఆమెను తిట్టారు, కొట్టబోయారు..

మహానటి సావిత్రిని ఒక జర్నలిస్ట్ కోర్టు వరకు లాగి, ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేసారని ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు.

  • Published On : March 22, 2024 / 07:39 PM IST

R Narayana Murthy speech about interesting incident of Mahanati Savitri life

Savitri : మహానటి సావిత్రి జీవితం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముళ్ల మధ్య ఉండే గులాబీ జీవితం సావిత్రిది. సినీ పరిశ్రమలో స్టార్ హీరోల మించి స్థాయిని అందుకున్న స్టార్‌డమ్ ఆవిడ సొంతం. కానీ అంతటి స్థాయిని అందుకొని కూడా ఒక జర్నలిస్ట్ వల్ల కోర్టు వరకు వెళ్లి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి రీసెంట్ కార్యక్రమంలో మాట్లాడారు.

Also read : Prithviraj Sukumaran : సినిమా షూటింగ్ కోసం వెళ్లి.. కరోనా వల్ల మూడు నెలలు పాటు అరబ్ దేశ ఎడారిలో..

ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. “మీడియా అనేది చాలా పవర్‌ఫుల్‌ ఆయుధం. అలాంటి ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించండి. అంతేగాని ఒకరి పర్సనల్ జీవితంలోకి వెళ్లి, వారి గురించి ఇష్టమొచ్చినట్లు రాయకండి. ఒకప్పుడు మహానటి సావిత్రి పై కూడా ఇలాగే పిచ్చి రాతలు రాసి కోర్టు వరకు వెళ్లారు. పరమేశ్వర అనే అప్పటి జర్నలిస్ట్ కి సావిత్రికి మధ్య విబేధాలు వచ్చారు.

దీంతో ఆ జర్నలిస్ట్ అహానికి పోయి సావిత్రిని కోర్టు వరకు లాగాడు. ఆ కేసు వల్ల ఆమె చాలాసార్లు కోర్టు వరకు రావాల్సి వచ్చిందట. మహానటి సావిత్రి కోర్టుకి రావడంతో.. ప్రతిసారి ఆమె అభిమానులు కోర్టు వద్ద తెగ గోల చేశారట. ఫైనల్లీ ఆ కేసుని న్యాయమూర్తి పరిష్కారించారు. కానీ అప్పటికే ఆమె జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆ కేసు వల్ల ఆమెను చాలా మంది తిట్టారు, కొంతమంది కొట్టబోయారు. కాబట్టి సినిమా వాళ్ళ పర్సనల్ విషయాలు పై రాసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అది మిమ్మల్ని చేతులెత్తి కోరుకుంటున్నాను” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.