Prithviraj Sukumaran : సినిమా షూటింగ్ కోసం వెళ్లి.. కరోనా వల్ల మూడు నెలలు పాటు అరబ్ దేశ ఎడారిలో..

సినిమా షూటింగ్ కోసం వెళ్లి కరోనా వల్ల మూడు నెలలు పాటు అరబ్ దేశ ఎడారిలో చిక్కుకుపోయిన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ టీం.

Prithviraj Sukumaran : సినిమా షూటింగ్ కోసం వెళ్లి.. కరోనా వల్ల మూడు నెలలు పాటు అరబ్ దేశ ఎడారిలో..

Prithviraj Sukumaran about Aadujeevitham The Goat Life shooting difficulties

Prithviraj Sukumaran : మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ ముందుకు వస్తుంటారు. ఇప్పుడు అదే క్రమంలో ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్న సినిమా ‘ఆడుజీవితం’. రియల్ లైఫ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. సంపాదించుకోవడం కోసం దుబాయ్ వెళ్లిన ఒక కేరళ వ్యక్తి.. అక్కడ బానిసగా మారి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు.

ఇక ఆ బానిస బ్రతుకు నుంచి తప్పించుకోవాలని భావించి.. నడుస్తూ ఇండియా చేరుకోవాలని ఎడారి ప్రయాణం మొదలుపెడతాడు. తాగడానికి కూడా నీరు దొరకని ఎడారి నుంచి ఆ వ్యక్తి ఇండియా ఎలా చేరుకున్నాడు అనేది సినిమా కథ. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కోసం చిత్ర యూనిట్ ఎంతో కష్టపడింది. 2009లో ఈ సినిమా కథని పృథ్వీరాజ్ సుకుమారన్ కి దర్శకుడు బ్లేస్సి వినిపించారు.

Also read : Kalki 2898 AD : కల్కిలో ప్రభాస్ భైరవ పాత్ర గురించి నిర్మాత కామెంట్స్.. వీడియో వైరల్..

కానీ బడ్జెట్ కారణాలు వల్ల దాదాపు పదేళ్ల తరువాత 2018లో ఈ చిత్రం షూటింగ్ మొదలయింది. ఇక అప్పుడు మొదలైన ఈ సినిమా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ మూవీ షూటింగ్ అరబ్ దేశ ఎడారిలో చిత్రీకరించారు. ఈక్రమంలోనే 2020 సమయంలో జోర్డాన్ దేశ ఎడారిలో షూటింగ్ కోసం కొంత టీంతో పృథ్వీరాజ్ సుకుమారన్ అక్కడికి వెళ్లారు.

కొన్నిరోజులు అక్కడ షూటింగ్ జరుపుకున్న తరువాత.. కరోనా లాక్‌డౌన్ వచ్చింది. దీంతో మూడు నెలలు పాటు మొత్తం మూవీ టీం అంతా అక్కడే ఎడారిలో ఉండిపోవాల్సి వచ్చిందట. షూటింగ్ చేయడానికి లేదు, అక్కడి నుంచి ఇండియా రావడానికి లేదు. మూడు నెలలు పాటు ఎంతో ఇబ్బంది పడ్డారట. మూడు నెలలు తరువాత ప్రభుత్వ సహకారంతో మూవీ టీం అంతా ఇండియా తిరిగి వచ్చారట. ఈ విషయాన్ని ‘ఆడుజీవితం’ ప్రమోషన్స్ లో పృథ్వీరాజ్ తెలియజేసారు. మార్చి 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.