Kalki 2898 AD : కల్కిలో ప్రభాస్ భైరవ పాత్ర గురించి నిర్మాత కామెంట్స్.. వీడియో వైరల్..

కల్కిలో ప్రభాస్ పోషించే భైరవ పాత్ర గురించి నిర్మాత స్వప్న దత్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Kalki 2898 AD : కల్కిలో ప్రభాస్ భైరవ పాత్ర గురించి నిర్మాత కామెంట్స్.. వీడియో వైరల్..

Kalki 2898 AD producer Swapna Dutt comments about Prabhas role

Updated On : March 22, 2024 / 5:53 PM IST

Kalki 2898 AD : బాహుబలి తరువాత టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 AD’. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సి అశ్వినీదత్ సమర్పణలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ ‘భైరవ’ అనే పాత్రని పోషిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ తెలియజేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ పాత్ర గురించి నిర్మాత స్వప్న దత్.. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆసక్తికర కామెంట్స్ చేసారు. “ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్ర చాలా కాలం పాటు ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోతుంది” అంటూ స్వప్న పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు.

Also read : Chiranjeevi : చిరంజీవి పిలిచి డైరెక్షన్, యాక్టింగ్ ఛాన్స్ ఇస్తే నో చెప్పిన స్టార్ హీరో.. ఎవరో తెలుసా..!

అయితే అదే సమయంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ పై డౌట్ నెలకుంది. పార్టీల ప్రచారాలు వల్ల చాలామంది ప్రజలు థియేటర్స్ కి రాలేని పరిస్థితి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలతో పాన్ ఇండియా మార్కెట్ పై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ఇలాంటి పెద్ద సినిమాకి టికెట్ హైక్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు.

ఇలాంటి టైంలో ఇంతటి భారీ బడ్జెట్ సినిమాని రిలీజ్ చేస్తే భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ విషయం పై చిత్ర నిర్మాతలు ఎలా ముందుకు సాగుతారో చూడాలి. కాగా ఈ చిత్రంలో దీపికా పదుకోన్, దిశాపటాని హీరోయిన్స్ గా నటిస్తుంటే కమల్ హాసన్ విలన్ గా, అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ వంటి తారలు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం.