R.Narayana Murthy: డిగ్రీ చదివే రోజుల్లో ప్రేమలో పడిన ఎర్రన్న!

ఆర్ నారాయణమూర్తి అంటే సామజిక బాధ్యతగల సినిమాలు.. బడుగు, బలహీన వర్గాల సమస్యలు, అవినీతి, అక్రమాలపై పోరాటమే కనిపిస్తాయి. అందుకే ఆయన్ను ప్రేక్షకులు ఎర్రన్న అని అభిమానంగా పిలుచుకుంటారు. ఇంత చేసినా ఎర్రన్న పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. కానీ.. ఆయన డిగ్రీ చదివే రోజుల్లోనే ఒకామెని ప్రేమించారు.

R.Narayana Murthy: ఆర్ నారాయణమూర్తి అంటే సామజిక బాధ్యతగల సినిమాలు.. బడుగు, బలహీన వర్గాల సమస్యలు, అవినీతి, అక్రమాలపై పోరాటమే కనిపిస్తాయి. అందుకే ఆయన్ను ప్రేక్షకులు ఎర్రన్న అని అభిమానంగా పిలుచుకుంటారు. హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా ఆయన ఒక బాధ్యతగానే సినిమాలు తెరకెక్కిస్తారు. కోట్లు సంపాదించినా కాలినడకనే నమ్ముకుంటారు.

అవి మాత్రమే కాదు తమ సినిమాలలో నటిస్తే కోట్ల రూపాయలిస్తామన్నా.. నమ్మిన సిద్ధాంతం కోసం కమర్షియల్ సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే నారాయణమూర్తి గురించి పుస్తకమే రాయొచ్చు. ఇంత చేసినా ఎర్రన్న పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. కానీ.. ఆయన డిగ్రీ చదివే రోజుల్లోనే ఒకామెని ప్రేమించారు. ఆమె కూడా ఎర్రన్నని మనస్పూర్తిగా ఇష్టపడ్డారు. కానీ.. ఈ విషయంలో కూడా ఎర్రన్న ఆదర్శంగా అలోచించి ఆమెని దూరం చేసుకున్నారట.

నారాయణమూర్తి డిగ్రీ సహవిద్యార్థిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. ముందుగానే ఆమెతో తన భావాలు, సినిమాల ఆసక్తిని వివరించగా ఆమె కూడా అందుకు ఒకే చెప్పారట. అయితే, పెళ్లి విషయంపై వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడేందుకు అమ్మాయి ఇంటికి వెళ్లిన క్రమంలో నారాయణమూర్తి తన ఆలోచనను మార్చుకున్నారట. అమ్మాయి వాళ్ళది ధనవంతుల కుటుంబం కాగా.. ఆమెకి ఏ లోటు లేకుండా పెద్ద వాళ్ళు పెంచారట.

అయితే.. పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉంటుందో గ్యారంటీ ఉండదని.. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియని రంగాన్ని ఎంచుకున్న తాను ఆమెకి కరెక్ట్ కాదని భావించారట. తాను చెట్టుకింద పడుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటానని.. తనతో సుఖంగా బ్రతకలేవని ఆమెకి వివరించారట. ఆ సమయంలో ఆమె ఎంత ఏడ్చినా ఆమె మంచి కోసమే నారాయణమూర్తి ఆ నిర్ణయం తీసుకున్నారట. ఆ తర్వాత చెన్నై వెళ్లిన నారాయణమూర్తి సినిమా రంగంలో ప్రవేశించి అలా సాగిపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు