NTR : అభిమానులు నుంచి ఎన్టీఆర్ పై చాలా ప్రెజర్ ఉంటుంది.. రాశి ఖన్నా!

టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా.. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. తాజాగా ఈ భామ నటించిన 'ఫర్జి' సిరీస్ మంచి విజయం సాధించడంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పై కామెంట్స్ చేసింది.

NTR : అభిమానులు నుంచి ఎన్టీఆర్ పై చాలా ప్రెజర్ ఉంటుంది.. రాశి ఖన్నా!

raashi khanna says ntr had faced so musch pressure from fans

Updated On : March 8, 2023 / 3:30 PM IST

NTR : టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా.. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. తాజాగా ఈ భామ ‘ఫర్జి’ అనే వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో కలిసి నటించింది. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ మంచి విజయం సాధించడంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పై కామెంట్స్ చేసింది.

NTR: సెన్సేషనల్ కాంబో.. ఎన్టీఆర్-ధనుష్ మల్టీస్టారర్‌కు ముహూర్తం ఫిక్స్..?

గతంలో రాశి ఖన్నా, ఎన్టీఆర్ తో కలిసి జై లవకుశ సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ వంటి స్టార్ తో నటించడం ఏమన్నా ప్రెజర్ అనిపించిందా? అని ప్రశ్నించగా రాశి బదులిస్తూ.. ”నిజానికి మాకంటే ఎక్కువ ప్రెజర్ తారక్ పేస్ చేసేవాడు. తారక్ పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉంటాయి. వారి అంచనాలు తారక్ పై చాలా ప్రెజర్ తీసుకు వస్తుంటాయి. ఆ సినిమాలో తారక్ మూడు పాత్రల్లో నటించాడు. తారక్ సెట్ కి వచ్చాక అతనిలో కేవలం సినిమాలోని క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ఒక పెద్ద స్టార్ అని భావన ఎన్టీఆర్ లో అసలు కనిపించదు. ఎప్పుడు ఒదిగే ఉంటాడు. అందుకునేమో నాకు తారక్ తో నటించేటప్పుడు పెద్ద ప్రెజర్ అనిపించలేదు” అంటూ బదులిచ్చింది.

NTR : అభిమానుల పై ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్.. వీడియో వైరల్!

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఇటీవల ఎన్టీఆర్ కూడా అభిమానుల వల్ల చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాము అంటూ కళ్యాణ్ రామ్ అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాశి ఖన్నా కూడా అదే వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు వల్ల ఎన్టీఆర్ ఎంత ప్రెజర్ కి గురవుతున్నాడో అర్ధమవుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవలే జాన్వీ కపూర్ ని NTR30 లోకి ఆహ్వానిస్తూ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఆస్కార్ నుంచి తిరిగి రాగానే ఈ మూవీ పై పూర్తి ద్రుష్టి పెట్టనున్నాడట ఎన్టీఆర్.