Raashii Khanna – Vaani Kapoor : ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాశీఖన్నా, వాణి కపూర్..

తాజాగా హీరోయిన్స్ రాశీఖన్నా, వాణి కపూర్ కలిసి నేడు ఉదయమే ఆలయానికి వెళ్లారు.

Raashii Khanna – Vaani Kapoor : ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాశీఖన్నా, వాణి కపూర్..

Raashii Khanna and Vaani Kapoor Visited Today Morning Mahakaleshwar temple in Ujjain

Updated On : May 28, 2024 / 9:22 AM IST

Raashii Khanna – Vaani Kapoor : హీరోయిన్స్ రాశీఖన్నా, వాణి కపూర్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి మంచి స్నేహితులు. వాణి కపూర్ రాశీఖన్నా ఇద్దరు కలిసి ఇండస్ట్రీకి వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టినవాళ్ళే. ఎన్నో ఏళ్ళ నుంచి వీరి స్నేహం కొనసాగుతుంది. ముంబైలో పార్టీలకు, ఈవెంట్స్ కు కూడా ఇద్దరూ కలిసి వెళ్తారు. తాజాగా ఈ ఇద్దరు హీరోయిన్స్ కలిసి నేడు ఉదయమే ఆలయానికి వెళ్లారు.

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయానికి రాశీఖన్నా, వాణి కపూర్ నేడు ఉదయం వెళ్లి పూజా కార్యక్రమాలలో పాల్గొని ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయంలోని శివుడికి అభిషేకం, పూజలు చేస్తుంటే అక్కడే భక్తులతో పాటు కూర్చొని భక్తిలో మునిగారు. రాశీఖన్నా, వాణి కపూర్ ఇద్దరూ పద్దతిగా చీర కట్టుకొని మహాకాళేశ్వరుని ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : Vamsi Karumanchi : అమెరికా నుంచి వచ్చి కరోనాలో ఇరుక్కుపోయి సినిమా తీసిన నిర్మాత..

ఆలయ సందర్శన అనంతరం రాశీఖన్నా, వాణి కపూర్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. చాలా ఆనందంగా ఉంది. మహాకాళేశ్వరుడు మమ్మల్ని మళ్ళీ పిలుస్తాడని ఆశిస్తున్నాను అని తెలిపారు. ఇక రాశీఖన్నా, వాణికపూర్ ఇద్దరూ కూడా బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.