Raashii Khanna open up about her crush
Raashii Khanna : అన్‌స్టాపబుల్ సీజన్ 2లో.. బాలకృష్ణ ఎవరు ఊహించని గెస్ట్ లను తీసుకు వస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్‌కే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తీసుకువచ్చి అదరగొట్టిన బాలయ్య, తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని తీసుకువచ్చి అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతున్నాడు. ప్రభాస్ ఎపిసోడ్ ఈ నెల 30న ప్రసారం కానున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు.
Prabhas: ప్రభాస్-మారుతి మూవీలో బాలీవుడ్ హీరో అలాంటి పాత్ర చేస్తాడా..?
కాగా ఇప్పుడు కొత్త ఎపిసోడ్ గెస్ట్‌లుగా అలనాటి హీరోయిన్లు తీసుకువచ్చాడు. అందం అభినయం కలగలిపిన సహజనటి జయసుధ, ముల్టీటాలెంటెడ్ జయప్రద ఈ కొత్త ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి సందడి చేయనున్నారు. వీరితో పాటు ప్రెజెంట్ టాలీవుడ్ హీరోయిన్ రావిషింగ్ రాశి ఖన్నా కూడా హాజరయ్యి ఎపిసోడ్ కి ఇంకొంచెం గ్లామర్ పెంచనుంది. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్.
ముగ్గురు భామల మధ్య బాలకృష్ణ.. నారి నారి నడుమ నందమూరి అంటూ చిలిపి అల్లరి చేయనున్నాడు. కాగా ఈ ప్రోమోలో బాలయ్య, రాశి ఖన్నాని.. ‘నువ్వు నటించిన హీరోల్లో నీకు ఎవరి మీద క్రష్ ఉంది’ అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రాశి.. ‘నాకు విజయ్ దేవరకొండ మీద క్రష్ ఉంది’ అంటూ తన మనసులోని మాటని చెప్పుకొచ్చింది. గతంలో ఈ అమ్మడు విజయ్ తో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నటించింది.
Mugguru muddhugummala tho mana balakrishnudu. Ayana allari, sandadi chudaalsindhe. December 23 na, mee aha lo.?#UnstoppableWithNBKS2 #NBKOnAHA #Jayasudha @realjayaprada #RaashiKhanna #MansionHouse @tnldoublehorse @realmeIndia @Fun88India #ChandaBrothers @sprite_india pic.twitter.com/QTRIEZHD7e
— ahavideoin (@ahavideoIN) December 19, 2022