Prabhas: ప్రభాస్-మారుతి మూవీలో బాలీవుడ్ హీరో అలాంటి పాత్ర చేస్తాడా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతితో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సైలెంట్‌గా స్టార్ట్ చేసిన ప్రభాస్, ఇప్పటికే కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేశాడు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెక్ట్స్ లెవెల్‌కు చేరుకుంది.

Prabhas: ప్రభాస్-మారుతి మూవీలో బాలీవుడ్ హీరో అలాంటి పాత్ర చేస్తాడా..?

Sanjay Dutt To Play Grandfather In Prabhas Maruthi Movie

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతితో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సైలెంట్‌గా స్టార్ట్ చేసిన ప్రభాస్, ఇప్పటికే కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేశాడు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెక్ట్స్ లెవెల్‌కు చేరుకుంది.

ఈ సినిమాను దర్శుకుడు మారుతి ఎలాంటి కథతో తీసుకొస్తున్నాడా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. అయితే ఇదొక హార్రర్ కామెడీ జోనర్ మూవీగా రాబోతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ పరంగా కూడా సరికొత్తగా కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Prabhas: ప్రభాస్, మారుతీల సినిమా టెస్ట్ షూట్ ప్రారంభం..

ప్రభాస్ సినిమా అంటే ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీ కాబట్టి, సంజయ్ దత్ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పేశాడట. అయితే ఈ సినిమాలో సంజయ్ దత్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అని చూసేవారికి మాత్రం చిత్ర యూనిట్ ఓ షాకిచ్చేందుకు రెడీ అవుతోందట. ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రభాస్ తాత పాత్రలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే హీరో తాత పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తాడా లేక ఇదంతా కేవలం పుకారేనా అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.