Raashii Khanna
Raashii Khanna : పవన్ కళ్యాణ్ ఓ పక్క ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నా చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేస్తున్నారు. ఇటీవలే OG సినిమా షూటింగ్ పూర్తిచేశారు. ఆ సినిమా సెప్టెంబర్ 25 రిలీజ్ కానుంది. మరో పక్క పవన్ చేతిలో మిగిలిన ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Raashii Khanna)
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాశీఖన్నా పవన్ కళ్యాణ్ తో దిగిన స్పెషల్ సెల్ఫీని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. పవన్ కళ్యాణ్ తో దిగిన సెల్ఫీని షేర్ చేసి రాశీఖన్నా.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో ఆయనతో కలిసి పనిచేయడం ఒక అద్భుతం. ఇది ఎప్పటికి ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది అని రాసుకొచ్చింది.
Also Read : Mirai: బ్యాడ్ లక్ అంటే ఇదే.. మిరాయ్ ని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్?
దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పార్ట్ షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలు ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అవి కూడా త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి 2026 లో ఈ సినిమాని రిలీజ్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం రాశీఖన్నా పవన్ తో దిగిన సెల్ఫీ ఫోటో వైరల్ గా మారింది.