బోల్డ్ లుక్‌లో రాశిఖన్నా

బోలెడు అవకాశాలు రావాలంటే బోల్డ్ గా ఉండాలి..లేకపోతే ఇప్పుడొస్తున్న కొత్త హీరోయిన్లతో పోటీ పడలేం అంటోంది క్యూట్ భామ. మొన్నామధ్య వరకూ పెద్దగా పట్టించుకోని హీరోలు కూడా ఇప్పుడు ఈ హీరోయినే కావాలంటున్నారు. ఇంతకీ అందర్నీ ఎట్రాక్ట్ చేసేలా రాశిఖన్నా ఏం చేస్తోంది..?
రాశిఖన్నా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమా రిలీజ్ లతో బిజీగా ఉంది. వెంకీమామ సినిమా రిలీజ్ అయ్యిందో లేదో..మళ్లీ సాయి ధరమ్ తేజ్ తో ప్రతి రోజూ పండగే సినిమా కూడా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను అకౌంట్ లో వేసుకుంది.
ఎన్నాళ్లని సాంప్రదాయ బద్దంగా సో కాల్డ్ సినిమాలు చేసుకుందాం.. అవకాశాల కోసం ఇంకాస్త అందంగా కనిపిద్దాం అనుకుందో.. ఏమో.. కాస్త బోల్డ్ గా కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో అసలు ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయనంత గ్లామర్ అండ్ బోల్డ్ గా కనిపించి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమాలో మిగతా హీరోయిన్లు ఆల్రెడీ గ్లామర్ హీరోయిన్లుగా ప్రూవ్ చేసుకున్నారు. మరి ఈ హాట్ చిక్స్ తో పోటీపడడానికి రాశి కూడా అంతే బోల్డ్ గా ట్రాన్స్ ఫామ్ అయ్యి కనిపించింది.
అంతకుముందు సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసినా .. పెద్దగా నోటీస్ చెయ్యని హీరోలు ఇప్పుడు ఫుల్ గా కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో బెంగాల్ టైగర్ సినిమాలో బికినీ తో బోల్డ్ గా కనిపించినా సినిమా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఆడియన్స్ కూడా అంత కాన్సన్ ట్రేట్ చెయ్యలేదు. బట్..ఇప్పుడు మాత్రం పాప ఫుల్ స్పీడ్ లో ఉంది. టైమ్ దొరికినప్పుడల్లా మాంచి హాట్ ఫోటోషూట్స్ తో ఫుల్ గ్లామరస్ గా కనిపిస్తోంది.