Raasi
Raasi : రంగస్థలం సినిమా చరణ్ కెరీర్లో పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా సినిమాలో నటించిన వారందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర కూడా బాగా వైరల్ అయింది. ఆ పాత్రతో అనసూయకు సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు వచ్చాయి.(Raasi)
అయితే ఈ పాత్రకు మొదట రాశి అనుకున్నారని, ఆమె నో చెప్పిందని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఛానల్ కి రాశి ఇంటర్వ్యూ ఇవ్వగా అది నిజమే అని చెప్పి ఎందుకు ఈ పాత్ర వదులుకుందో తెలిపింది.
Also Read : Raasi : అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోమని అడిగేసా.. రాశి లవ్ స్టోరీ మాములుగా లేదుగా.. నెల రోజుల్లో..
రాశి మాట్లాడుతూ.. రంగమ్మత్త పాత్రకు మొదట నన్ను అడిగారు. సుకుమార్ గారు పిలిచి మాట్లాడారు. కథ, క్యారెక్టర్, సీన్స్ అన్ని చెప్పారు. అప్పుడు నేను లావుగా ఉన్నాను. ఆ పాత్రకు ఒక డ్రింకింగ్ సీన్, స్నానం చేస్తూ మాట్లాడటం, చరణ్ తో బోట్ లో సీన్.. ఇలా ఇంకొన్ని సీన్స్ నాకు సెట్ అవ్వవు అనిపించింది. ఒక తల్లిగా ఆ పాత్ర నాకు సెట్ అవ్వదు అనిపించింది. అదే చెప్పాను నేను. అందుకే రంగమ్మత్త పాత్ర వద్దని చెప్పాను. అనసూయ చాలా బాగా చేసింది. ఆ పాత్ర మిస్ అయినందుకు నేనేమి ఫీల్ అవ్వలేదు అని చెప్పుకొచ్చింది.