Raasi : అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోమని అడిగేసా.. రాశి లవ్ స్టోరీ మాములుగా లేదుగా.. నెల రోజుల్లో..
హీరోయిన్ రాశి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లవ్ స్టోరీ గురించి తెలిపింది. (Raasi)

Raasi
Raasi : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉండి ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరీర్ మొదలుపెట్టి తర్వాత హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలు చేసింది. సీరియల్స్ లో కూడా నటించింది. తాజాగా రాశి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లవ్ స్టోరీ గురించి తెలిపింది. (Raasi )
రాశి తన లవ్ స్టోరీ గురించి చెప్తూ.. అసిస్టెంట్ డైరెక్టర్ ని నేనే పెళ్లి చేసుకో అని అడిగాను. రాజేంద్రప్రసాద్ గారితో సినిమా చేస్తున్నాను. అక్కడే ఆయన పరిచయం. ఆయన వుమెన్ తో నడుచుకునే విధానం నాకు నచ్చింది. శ్రీమంతం సీన్ లో ఆయన ఏడుస్తున్నారు. నా ఎదురుగా ఉన్నాడు. సీన్ లో మా ఫీలింగ్స్ ని అర్ధం చేసుకున్నారు. ఆయన ఏడ్చేసి వెళ్లిపోయారు. ఒక అబ్బాయి ఏడ్చాడంటే చాలా సెన్సిటివ్ పర్సన్. అతను అమ్మాయిలతో ఉండే విధానం నచ్చింది. అతను ఫ్యామిలీని కేర్ చేస్తారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం. షూట్ లో ఆయన్ని బాగా టీజ్ చేశాను. ఒక రోజు బాగా ఏడ్పించాను. తర్వాత సారీ చెప్దామని నంబర్ తీసుకొని ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటారా శ్రీనివాస్ అని అడిగాను. ఆయన ఇది కూడా జోక్ అనుకోని వెంటనే ఎస్ అన్నారు. నేను తర్వాత కలిసి మళ్ళీ అడిగాక నిజమా అని ఆశ్చర్యపోయారు.
అమ్మ వాళ్లకు చెప్తే సడెన్ షాక్ అయ్యారు. మా అన్నయ్య నన్ను తిట్టారు. నన్ను ఇంట్లో అడిగితే.. నేను చేసుకుంటారా అని అడగలేదు. చేసుకుంటాను అని చెప్పాను అని వాళ్ళతో అనడంతో అమ్మ ఒప్పుకుంది నా గురించి తెలిసి. ఆయన్ని రమ్మన్నారు, మాట్లాడారు. ఏప్రిల్ 23 ఆయనకు నేను ప్రపోజ్ చేశాను. నెల రోజుల్లో మే 23 మా పెళ్లి అయింది. మా ఇంట్లోనే పెళ్లి జరిగింది. చాలా తక్కువమంది ఇంపార్టెంట్ వాళ్ళతో. ఇప్పుడు పెళ్లి అయి 20 ఇయర్స్ అయిపోయింది అని తెలిపారు.
Also Read : OG Team : ది OG టీమ్.. ఫోటో వైరల్.. ఎవరెవరు ఉన్నారంటే..
Raasi
అలాగే షూటింగ్ టైం లో వీళ్లిద్దరి ఫన్నీ సీన్ స్కూడా కొన్ని తెలిపారు. రాశి మాట్లాడుతూ.. షూట్ స్టార్టింగ్ లో నా స్టాఫ్ రాలేదు ఇంకా. తను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఇంకా రెడీ అవ్వలేదా అని స్క్రిప్ట్ ఇచ్చాడు. స్క్రిప్ట్ లో నా డైలాగ్స్ ఏం లేవు ఆ సీన్ లో. చూసి వెళ్ళిపోయాడు. తర్వాత మేము క్లోజ్ అయ్యాక ఆ రోజు ఎందుకు వచ్చావు అని అడిగితే మీ లాంటి హీరోయిన్ ని దగ్గర్నుంచి చూడాలి అనిపించి వచ్చాను అన్నాడు. మరి చూసావుగా ఏమనిపించింది అంటే గట్టిగా పట్టుకొని ముద్దు ఇచ్చి పారిపోవాలి అనుకున్నా అని అన్నాడు.
మా లవ్ స్టోరీ గురించి సెట్ లో తెలిసింది. ఒక రోజు ఆయనే క్లాప్ కొట్టాల్సి వస్తే నాకు నవ్వొస్తుంది నువ్వు క్లాప్ కొట్టేసి వెళ్ళిపో అన్నాను. ఆ సినిమా డబ్బింగ్ జరిగేటప్పుడే మా పెళ్లి అయిపోయింది. మా విషయం రాజేంద్రప్రసాద్ గారికి తెలిసి హీరోయిన్ నే పెళ్లి చేసుకున్నావు కదా అని ఆయన్ని ఏడిపించారు అని చెప్పుకొచ్చింది. దీంతో రాశి లవ్ స్టోరీ వైరల్ గా మారింది. హీరోయిన్ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ కి ప్రపోజ్ చేయడం, తర్వాత సీన్స్ ఇవన్నీ ఓ సినిమాలా తీయొచ్చు, ఇదేదో నేనింతే సినిమా స్టోరీలా ఉందే అంటున్నారు.
Also See : OG Pre Release Event : OG ప్రీ రిలీజ్ ఈవెంట్.. వర్షంలో కూడా గ్రాండ్ సక్సెస్.. ఫొటోలు..