Radhe Shyam : అవన్నీ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి ‘రాధే శ్యామ్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు నిర్మాతలు..

Radhe Shyam : అవన్నీ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Radhe Shyam

Updated On : September 29, 2021 / 5:36 PM IST

Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు మూడేళ్లుగా ‘రాధే శ్యామ్’ సినిమాకే అంకితమైపోయారు.. డార్లింగ్ అండ్ గోర్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో, రెబల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద (ప్రభాస్ సిస్టర్) ఈ పాన్ ఇండియా సినిమాను భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

Prabhas Family : ఫ్యామిలీ పెద్దదే డార్లింగ్..!

ఎట్టకేలకు ‘రాధే శ్యామ్’ షూటింగ్‌కి ఇటీవల గుమ్మడికాయ కొట్టేశారు. ‘న్యూ ఇయర్.. న్యూ బిగినింగ్స్.. అండ్ ఎ న్యూ రిలీజ్ డేట్’ అంటూ 2022 జనవరి 14న ‘రాధే శ్యామ్’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యనున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. అయితే గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రిలీజ్ డేట్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.

Prabhas : ప్రభాస్ వ్యానిటీ వ్యాన్ చూశారా..

ఈ నేపథ్యంలో ప్రేక్షకాభిమానులకు క్లారిటీ ఇస్తూ రూమర్లకు చెక్ పెట్టారు నిర్మాతలు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్న ‘రాధే శ్యామ్’ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్.. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళీ వెర్షన్స్‌కి సంగీతాన్ని అందిస్తున్నారు. మిథున్, మనన్ భరద్వాజ్ హిందీ వెర్షన్‌కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..