Radheshyam first song : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సాంగ్ అద్భుతమైన లిరిక్స్…

ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ నిన్న రాత్రి విడుదల అయింది. జస్టిన్ ప్రభాకర్ అందించిన సంగీతం, యువన్ శంకర్ రాజా, హరిణి వాయిస్

Radheshyam first song : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సాంగ్ అద్భుతమైన లిరిక్స్…

Radheshyam

Updated On : November 16, 2021 / 7:45 AM IST

Radheshyam first song : ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ నిన్న రాత్రి విడుదల అయింది. జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం, యువన్ శంకర్ రాజా, హరిణి వాయిస్ తో ఈ పాట మరో లెవెల్ కి వెళ్ళిపోయింది. కృష్ణకాంత్ ఈ పాటకి అద్భుతమైన లిరిక్స్ అందించారు. కథకి తగ్గట్టు సినిమాలో విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమ గురించి వాళ్ళ జీవితం గురించి లిరిక్స్ లో అద్భుతంగా రాశారు. ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సాంగ్ లిరిక్స్ మీ కోసం..

Gangster Nayeem : గ్యాంగ్‌స్టర్‌ నయీం బయోపిక్

ఎవరో వీరెవరో.. కలవని ప్రేమికులా..
ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా..
వీరి దారొకటే.. మరి దిక్కులే వేరులే..
ఊపిరొకటేలే.. ఒక శ్వాసలా నిశ్వాసలా ఆటాడే విధా ఇదా ఇదా పదే పదే..
కలవడం ఎలా ఎలా.. రాసే ఉందా రాసే ఉందా..

ఈ రాతలే.. దోబూచులే..
ఈ రాతలే.. దోబూచులే..

ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా..
ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా..

ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో.. నాతో ఏదో కథ చెప్పాలంటుందే..
ఏ గూఢాచారో.. గాఢంగా నన్నే..
వెంటాడెను ఎందుకో ఏమో..
కాలం మంచు కప్పి గుండెల్లో గుచ్చే..
గాయం లేదు కానీ దాడెంతో నచ్చే..
ఆ మాయా ఎవరే.. రాదా ఎదురే.. తెలియకనే తహతహ పెరిగే..
నిజమో భ్రమో.. బాగుంది యాతనే..
కలతో కలో.. గడవని గురుతులే..
ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే

ఈ రాతలే.. దోబూచులే..
ఈ రాతలే.. దోబూచులే..

ఎవరో వీరెవరో.. కలవని ప్రేమికులా..
ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా..

Sampoornesh Babu : బెగ్గర్‌గా సంపూర్ణేష్ బాబు

ఇక ఈ పాట విన్న వాళ్లంతా ‘ఈ రాతలే.. దోబుచులే’ అంటూ నిన్న నైట్ నుంచి పాడుకుంటూనే ఉన్నారు.. ఈ పాట అంతగా జనాల్లోకి వెళ్ళింది.