Gangster Nayeem : గ్యాంగ్‌స్టర్‌ నయీం బయోపిక్

కొన్నేళ్ల క్రితం పోలీసులని, రాజకీయ నాయకులందరినీ హడలెత్తించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం ఆ తర్వాత అనూహ్య రీతిలో సినీ ఫక్కీలో మరణించాడు. తెలంగాణలో మావోయిస్టు లీడర్ గా, ఆ తర్వాత క్రిమినల్ గా

Gangster Nayeem : గ్యాంగ్‌స్టర్‌ నయీం బయోపిక్

Nayeem

Gangster Nayeem :  కొన్నేళ్ల క్రితం పోలీసులని, రాజకీయ నాయకులందరినీ హడలెత్తించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం ఆ తర్వాత అనూహ్య రీతిలో సినీ ఫక్కీలో మరణించాడు. తెలంగాణలో మావోయిస్టు లీడర్ గా, ఆ తర్వాత క్రిమినల్ గా, ఆ తర్వాత చోటా డాన్ గా మారుతూ మోసాలు చేస్తూ అందర్నీ భయపెడుతూ పోలీసులకి చిక్కకుండా తిరిగిన నయీమ్ 2016లో పోలీసుల ఎన్కౌంటర్ లో మరణించాడు. గతంలో గ్యాంగ్‌స్టర్‌ నయీంపై సినిమాలొచ్చాయి. గ్యాంగ్‌స్టర్‌ నయీంపై సినిమా చేస్తామని చాలా మంది ప్రకటించారు. తాజాగా గ్యాంగ్‌స్టర్‌ నయీంపై మరో బయోపిక్ రానుంది.

Sampoornesh Babu : బెగ్గర్‌గా సంపూర్ణేష్ బాబు

గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘నయీం డైరీస్‌’ ట్రైలర్ ని నిన్న సాయంత్రం విడుదల చేసారు. వశిష్ఠసింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దాము బాలాజీ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్‌ను నిన్న సాయంత్రం దర్శకుడు సంపత్‌నంది విడుదలచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్పిత కథాంశాలతో పోలిస్తే బయోపిక్‌లు ప్రేక్షకుల్లో ఎక్కువగా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఈ సినిమా ట్రైలర్‌ కొత్తగా ఉంది అని అన్నారు.

Comedians : స్పెషల్ పార్టీతో రచ్చ చేస్తున్న టాలీవుడ్ కమెడియన్స్

ఈ సినిమా దర్శకుడు మాట్లాడుతూ.. నక్సలైట్‌గా మొదలైన నయీం జీవితంలో ఏం జరిగిందనేది సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నాం. ఏడు సంవత్సరాలు జైలులో ఉన్న అతడు పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా, క్రిమినల్‌గా ఎలా మారాడో చూపిస్తున్నాం అని తెలిపారు. పరిస్థితుల ప్రభావం వల్ల ఓ మనిషి ఎలా మారిపోతాడో అర్థవంతంగా చూపించే సినిమా అని అన్నారు.