Radheshyam
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ‘రాధేశ్యామ్’ మార్చ్ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. రాధాకృష్ణ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ‘సాహో’ ఐతే ప్రపంచంలో చాలా దేశాల్లో రిలీజ్ అయింది. దీంతో ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ కూడా చాలా దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక భారత సినిమాలకి మన దేశం బయట అమెరికా పెద్ద మార్కెట్. అమెరికాలో తెలుగు వాళ్ళు, భారతీయులు ఎక్కువ మంది ఉండటంతో మన ప్రతి సినిమా అమెరికాలో రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది.
Minister Perni Nani: ఎన్టీఆర్ సినిమా గురించి ఏనాడైనా ట్వీట్ చేశారా.. లోకేష్‌కు నాని కౌంటర్!
ఇప్పుడు ‘రాధేశ్యామ్’ని అమెరికాలో భారీగా రిలీజ్ చేయనున్నారు. గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థ ‘రాధేశ్యామ్’ సినిమాని అమెరికాలో రిలీజ్ చేస్తుంది. ఒక్క అమెరికాలోనే 1116 లొకేషన్స్ లో 3116 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది. అంతే కాక ఒక్కరోజే 11,116 షోలు వేస్తున్నారు. ఈ లెక్కన అమెరికాలో ‘రాధేశ్యామ్’ భారీగా రిలీజ్ అవ్వడమే కాకుండా భారీ హిట్, మంచి కలెక్షన్స్ కూడా సాధించబోతుంది. ఒక్కరోజే ఇన్ని షోస్ వేసి అమెరికాలో తెలుగు సినిమా సత్తా చాటుతున్నాడు ప్రభాస్.