Raghav Omkar Sasidhar
Raghav Omkar Sasidhar : మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్ ‘ది 100’ సినిమాతో ఇటీవల జులై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రియ ఫిలిం కార్పొరేషన్, దమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ కరుటూరి, వెంకీ, తారక్ రామ్ నిర్మాణంలో రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా బాగానే మెప్పించింది.
దర్శకుడిగా మొదటి సినిమానే ది 100 లాంటి బాధ్యతాయుతమైన పోలీస్ డ్రామాను తెరకెక్కించిన దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాకు వచ్చిన సక్సెస్, ప్రశంసల గురించి మాట్లాడారు.
Also Read : Hari Hara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ మేకింగ్ వీడియో చూశారా? కొత్త సాంగ్ తో రిలీజ్..
రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు. భావోద్వేగం, బాధ్యత, నీతితో కూడిన కథ. ఇందులో నిజాయితీ గల పోలీస్ అధికారి బాధ్యత, బాధ, న్యాయం కోసం పోరాటం చేసే విధానాన్ని చూపించాం. థియేటర్లలో సినిమాను చూసి ఆదరించిన ప్రేక్షకులకు, మాకు సపోర్ట్ గా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ చిత్రంలోని ఎమోషన్స్ కు బాగా కనెక్ట్ అవడం సంతోషాన్ని ఇచ్చింది. ఆర్కే సాగర్ తో పాటు మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, అందరి పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అంజనా దేవి గారు, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్.. లాంటి ఎంతోమంది ప్రముఖుల నుంచి ప్రశంసలు రావడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. నా మొదటి సినిమాకే ఇంతటి సక్సెస్ రావడం ఆనందంగా ఉంది. ఈ జర్నీలో నాకు సపోర్ట్ గా నిలిచిన నిర్మాతలు, హీరో ఆర్‌కే సాగర్‌లకు ధన్యవాదాలు. త్వరలో మరో సినిమాతో వస్తాను అని తెలిపారు.
Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే గెస్టులు వీళ్ళే.. ఈసారి రాజకీయ నాయకులే..