Rudrudu : రాఘవ లారెన్స్ రుద్రుడు ట్రైలర్ రిలీజ్..

కొంత కాలంగా రాఘవ లారెన్స్ డైరెక్టర్ అండ్ యాక్టర్ గానే ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే రుద్రుడు (Rudrudu) అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ని నేడు రిలీజ్ చేశారు.

Raghava Lawrence Rudrudu movie trailer release

Rudrudu : రాఘవ లారెన్స్ (Raghava Lawrence) డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్స్ లిస్ట్ లో ఒకడిగా నిలిచాడు. డాన్స్ మాస్టర్ గానే కాదు నటుడిగా, డైరెక్టర్ గా పలు సూపర్ హిట్ సినిమాలు తీసి తన సత్తా ఏంటో బాక్స్ ఆఫీస్ కి చూపించాడు. కొంత కాలంగా అయితే డైరెక్టర్ అండ్ యాక్టర్ గానే ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే రుద్రుడు (Rudrudu) అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ని నేడు రిలీజ్ చేశారు.

Kushboo : వైరస్ ఎటాక్.. హాస్పిటల్ బెడ్ పై ఖుష్బూ..

ట్రైలర్ చూస్తుంటే పక్కా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. లైఫ్ ని హ్యాపీగా సాగించే హీరోకి ఒక ఫంక్షన్ లో హీరోయిన్ ఎదురవుతుంది. తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన హీరో, హీరోయిన్ కూడా ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటాడు. అయితే అనుకోకుండా భూమి అనే రియల్ ఎస్టేట్ వ్యక్తి వల్ల హీరోయిన్ కి ఏదో జరగడం, అక్కడి నుంచి హీరో.. భూమి అనే వ్యక్తిని ఎలా ఎదురుకున్నాడు అన్నది సినిమా కథ అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక యాక్షన్ సీన్స్ అండ్ డాన్సులతో అదరగొట్టేసే లారెన్స్ ఈ సినిమాతో కూడా అలరించనున్నాడు.

Pushpa 2 : అడవిలో పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం..

కాగా తమిళ ప్రొడ్యూసర్ ఎస్ కతిరేసన్ దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాని తెరకెక్కించాడు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్, నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్ ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. జి వి ప్రకాష్ (G V Prakash Kumar), ధరన్ కుమార్ పాటలు అందించగా సామ్ సి ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుందో చూడాలి.