Kushboo : వైరస్ ఎటాక్.. హాస్పిటల్ బెడ్ పై ఖుష్బూ..
సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ (Kushboo) అడెనో వైరస్ (Adeno virus) సోకడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.

Kushboo effected by Adeno virus and admitted into hospital
Kushboo : సినీ నటి, రాజకీయ వేత్త ఖుష్బూ సుందర్ (Kushboo) మళ్ళీ హాస్పిటల్ పాలయ్యారు. 5 నెలలు క్రిందటే వెన్నుముక్క సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఖుష్బూ.. ట్రీట్మెంట్ తీసుకోని ఆరోగ్యంగా ఇంటికి తిరిగొచ్చారు. దీంతో ఆమె మళ్ళీ సినీ, రాజకీయ కలాపాలుతో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా ఎన్నికైంది. తాజాగా ఆమెకు అడెనో వైరస్ (Adeno virus) సోకడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఈ విషయాన్ని ఖుష్బూ తన సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలియజేసింది.
Samantha : మరో కొత్త పార్టనర్‌తో వస్తున్న సమంత..
‘అడెనో వైరస్ చాలా ప్రమాదకరమైనది. దానిని ఎవరు తక్కువ అంచనా వేయ వద్దు. అది నా పై చాలా దుష్ప్రభావం చూపింది. హై ఫీవర్, తీవ్రమైన ఒంటినొప్పులు వచ్చి బాగా బలహీన పడిపోయాను. ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అలాగే మీకు కూడా ఏమన్నా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తం అవ్వండి. జాగ్రత్త వహించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ అంటూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ తో పాటు హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశారు.
Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని అడ్డుకున్న పోలీసులు.. వైరల్ అవుతున్న వీడియో!
ఇక ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు, సినీ మరియు రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ.. త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటే వైరల్ అవుతుంది. కాగా ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్న ఖుష్బూ.. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవి చేపట్టిన దగ్గర నుంచి కొత్త సినిమాకి సైన్ చేయడం లేదు. మరి సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇచ్చారా? అనేది తెలియాలి.
View this post on Instagram