Samantha : మరో కొత్త పార్టనర్‌తో వస్తున్న సమంత..

మొన్నటి వరకు విడాకులు, అనారోగ్యం సమస్యలు ఎదురుకున్న సమంత.. ఇప్పుడు కోలుకొని ముందుకు దూసుకుపోతుంది. తాజాగా సమంత మరొకరితో పార్టనర్ గా చేతులు కలిపింది.

Samantha : మరో కొత్త పార్టనర్‌తో వస్తున్న సమంత..

Samantha enters into Tommy Hilfiger business

Updated On : April 7, 2023 / 5:14 PM IST

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత (Samantha) సినిమా రంగంలోనే కాదు బిజినెస్ రంగంలోనూ దూసుకు పోతుంది. ఎడ్యుకేషన్, క్లాతింగ్ వంటి సంస్థల్ని స్వయంగా స్థాపించిన సామ్.. హోటల్ అండ్ ఫుడ్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టి సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల నౌరీష్ యు అనే ఓ ఫుడ్ సంస్థలో సమంత ఇన్వెస్ట్ చేసింది. ఇక ఈ బిజినెస్ లో పార్టనర్ గా జాయిన్ అయ్యి 10 రోజులు కూడా కాలేదు అప్పుడే మరో కొత్త బిజినెస్ లో పార్టనర్ గా భాగం అయ్యింది. టామీ హిల్ ఫిగర్ (Tommy Hilfiger) సంస్థలో సమంత పెట్టుబడులు పెట్టింది.

Samantha : నాగచైతన్యపై సమంత నిజంగానే ఆ వ్యాఖ్యలు చేసిందా.. క్లారిటీ ఇచ్చిన సమంత

ఈ సంస్థలోని హ్యాండ్ వాచ్స్ (Watch) సంబంధించిన బిజినెస్ లోనే సామ్ పార్టనర్ గా జాయిన్ అయ్యింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో Tommy Hilfiger కొత్త SS 23 మోడల్ వాచ్ ని ప్రమోట్ చేస్తూ ఒక వీడియో షేర్ చేసింది. అలాగే ఈ సంస్థతో భాగ్యస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చింది. కాగా విడాకులు, అనారోగ్యం సమస్యలు ఎదురుకున్న సమంత.. ఈరోజు వాటన్నిటిని ఎదురుకొని ఇలా ముందుకు వెళ్లడం చూసి అభిమానులు, నెటిజెన్లు సామ్ ని అభినందిస్తున్నారు.

ఇక సినిమా విషయాలకు వస్తే.. బాలీవుడ్ లో సిటాడెల్ (Citadel) అనే స్పై యాక్షన్ వెబ్ సిరీస్ లో నటించింది. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) ఖుషీ మూవీ చేస్తుంది. మరో సినిమా శాకుంతలం (Shaakuntalam) రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మైథాలజి డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. గుణశేఖర్ ఈ సినిమాని నిర్మిస్తూ డైరెక్ట్ చేశాడు. సమంత మెయిన్ లీడ్ లో నటిస్తుండగా మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్ర పోషించాడు. అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ (Allu Arha) ప్రిన్స్ భారత పాత్రలో కనిపించబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)