Raghava Lawrence: మరోసారి గొప్పమనసు చాటుకున్న లారెన్స్.. పాఠశాల కోసం సొంత ఇంటిని ఇచ్చేశాడు

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గురించి, ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు(Raghava Lawrence). సమాజ సేవలో ఆయన చాలా ముందు ఉంటారు.

Raghava Lawrence who gave his house for a school

Raghava Lawrence: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గురించి, ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాజ సేవలో ఆయన చాలా ముందు ఉంటారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే వెళ్లి సాయం అందిస్తారు. ఆయన సంపాదనలో ఎక్కువ శాతం కూడా సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది అనాధలకు, వికలాంగులకు, పేద విద్యార్థులకు, రైతులకు తనవంతుగా ఆర్థికం సహాయం అందిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన శ్వేత అనే దివ్యాంగురాలు కుటుంబానికి స్కూటీ బహుమతిగా ఇచ్చాడు. ఆ మధ్య ఒక మహిళకు ఆటో కొన్ని జీవనోపాధిని అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

Malavika Mohanan: ఆ క్షణాలు చాలా మధురం.. ప్రభాస్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్.. ఫ్లోలో రాజాసాబ్ అప్డేట్ కూడా ఇచ్చేసిందిగా!

తాజాగా మరోసారి తన దయాహృదయాన్నీ చాటుకున్నాడు లారెన్స్(Raghava Lawrence). పాఠశాల కోసం తాను ఎంతో ప్రేమగా కట్టించుకున్న ఇంటిని ఇచ్చేశాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. నా సినిమాలకు తీసుకునే అడ్వాన్స్‌ డబ్బులను సేవా కార్యక్రమాల కోసం వాడుతున్నాను. ఈ విషయం మీకు కూడా తెలుసు. నేను ఎంతో ప్రేమగా నిర్మించుకున్న నా తొలి ఇంటిని విద్యార్థుల కోసం పాఠశాలగా మారుస్తున్నాను. ఈ విషయం తెలియజేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఇల్లు నాకు చాలా ప్రత్యేకం.

ఇంతకు ముందు ఈ ఇంటిని అనాథాశ్రమంగా మార్చాను. ఇక్కడ ఆశ్రయం పొందిన వారు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి నా ఇంటిని సేవ కోసం వినియోగిస్తున్నందుకు గర్వంగా ఉంది. దీనికి కూడా మీ అందరి ఆశీస్సులు కావాలి. మీరంతా నాకు సపోర్ట్‌ గా ఉంటారని ఆశిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు లారెన్స్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం లారెన్స్ కాంచన 4, బుల్లెట్టు బండి అనే సినిమాలు చేస్తున్నారు.