Raghavendrarao speech in Dhamaka Pre Release Event
Raghavendrarao : రవితేజ, శ్రీలీల జంటగా తెరకెక్కిన సినిమా ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్ నిర్మాణంలో రవితేజ డ్యూయల్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ వీర లెవల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. మొదటిసారి రవితేజ ప్రమోషన్స్ లో ఫుల్ గా పాల్గొంటున్నాడు. టీవీ షోలకి వచ్చి మరీ ధమాకా సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు రవితేజ.
ఆదివారం నాడు ధమాకా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ”నేను దర్శకత్వం చేసిన అల్లరి ప్రియుడు సినిమాలో ఆర్కెస్ట్రా గ్రూపులో ఒకడిగా వచ్చి డ్రమ్స్ వాయించాడు రవితేజ. అప్పుడు అతన్ని చూసినప్పుడే ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు రవితేజ పెద్ద హీరో అయ్యాడు. ఇటీవల నా దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాలో నటించి అందర్నీ మెప్పించింది శ్రీలీల. వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాకి కనకవర్షం కురవాలి” అని అన్నారు.
BiggBoss Winning Amount : బిగ్‌బాస్.. విన్నర్ కంటే ఎక్కువ గెలుచుకున్న రన్నరప్.. ఎవరికి ఎంతో తెలుసా??
అలాగే.. త్వరలోనే రవితేజ కొడుకు కూడా హీరో కాబోతున్నాడు అని తెలిపారు రాఘవేంద్రరావు. దీంతో మాస్ మహారాజ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జూనియర్ రవితేజ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఇన్నాల్లూ గాసిప్స్ వినిపించినా ఇప్పుడు రాఘవేంద్రరావు చెప్పడంతో కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయారు.