×
Ad

Raghu Kunche : రాయలసీమలో జరిగిన ఫ్యాక్షన్ కథలతో సినిమా.. ‘దేవగుడి’ దర్శక నిర్మాత, రఘు కుంచె ఇంటర్వ్యూ..

నేడు దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి, రఘు కుంచె మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలు తెలిపారు.(Raghu Kunche)

Raghu Kunche

Raghu Kunche : పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం రామకృష్ణా రెడ్డి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దేవగుడి’. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన దేవగుడి సినిమా జనవరి 30న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా నేడు దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి, రఘు కుంచె మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలు తెలిపారు.(Raghu Kunche)

దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గతంలో నేను శ్రీకాంత్ గారితో నిర్మాతగా ఒక సినిమా చేసాను. దర్శకుడిగా దృశ్యకావ్యం సినిమా చేశాను. శ్రీకాంత్ గారు సినిమాలో నా ఇన్వాల్వ్ మెంట్ చూసి మీలో దర్శకుడు కూడా ఉన్నారు, మీరే డెరెక్ట్ చేయొచ్చు కదా అని ఎంకరేజ్ చేశారు. నేను ఇంజినీర్ ను కాబట్టి పక్కా ప్లానింగ్ తో షూటింగ్ పూర్తిచేసాము. మా మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల్లో మా సినిమాకే డిజిటల్ వ్యూస్ ఎక్కువగా ఉన్నాయి. కాస్త వయలెన్స్, రొమాంటిక్ సాంగ్ ఉందని రెండు కట్స్ తో ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఇంకా ఎవ్వరికి ఇవ్వలేదు అడుగుతున్నారు అని అన్నారు.

అలాగే ఈ సినిమా గురించి చెప్తూ.. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండే సినిమా ఇది. అయినా స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ మీద కథ నడుస్తుంది. దేవగుడి వీరారెడ్డి పాత్రలో రఘు కుంచె. ఆయనకు కూతురు, కొడుకు ఉంటారు. వాళ్ల ఇంటి డ్రైవర్ కొడుకు. ఈ ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీళ్ల కథే ఈ సినిమా. ఈ సినిమాలో 11 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. రాయలసీమలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాము. ఈ సినిమాకు నార్మల్ టికెట్ రేట్స్ పెడుతున్నాం. సినిమా రిలీజయిన తర్వాత సోమవారం నుంచి మా సినిమాని పైరసీలో చూడాలనుకుంటే మాకు చెప్పండి మేమే థియేటర్ టికెట్ బుక్ చేస్తాము. ఇలాంటి సినిమా థియేటర్స్ లో చూడాలి అని తెలిపారు.

Also Read : Barabar Premistha : బరాబర్ ప్రేమిస్తా నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్.. ‘మళ్ళీ మళ్ళీ నీ కౌగిల్లోనే..’

Raghu Kunche

సంగీత దర్శకుడు, సింగర్, నటుడు రఘుకుంచె మాట్లాడుతూ.. నాకు పలాస సినిమా తర్వాత అలాంటి రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇది చాలా పవర్ ఫుల్ రోల్. రాయలసీమ యాస కోసం కష్టపడ్డాను. సినిమా షూటింగ్ అంతా రియల్ లొకేషన్స్, రియల్ సంఘటనలు జరిగిన చోట చేసాము. నేను జీపులో వెళ్తుంటే నా పక్కన ఓ ఇరవై సుమోలు, జీపులు వస్తుంటాయి. అన్ని వాహనాలతో కాన్వాయ్ లా వెళ్లడం పర్సనల్ గా గర్వంగా అనిపించేది. అందుకే వీరారెడ్డి పాత్రలో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. యాక్షన్ సీక్వెన్సుల్లో, కొన్ని బాంబ్ బ్లాస్ట్స్ సీన్స్ లో భయపడ్డాను, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్నా సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అక్కడ రిటైర్ అయిన రియల్ ఫ్యాక్షనిస్టులు కూడా ఈ సినిమాలో నటించారు అని తెలిపారు.

అలాగే తన గురించి చెప్తూ.. యాక్టర్ కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలా జరిగిపోయింది. సింగర్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను కానీ తర్వాత 40 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాను. ఈ సినిమాలో కూడా ఒక పాట కంపోజ్ చేశాను. ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నా. మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ వస్తే చేస్తాను అది వదిలిపెట్టలేదు అని చెప్పారు.

Also See : Sukriti Veni Birthday Celebrations : ఘనంగా సుకుమార్ కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్.. సుకృతి వేణి ఫొటోలు వైరల్..