AR Rahman: నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి.. వివాదాస్పద కామెంట్స్ పై వివరణ ఇచ్చిన రెహమాన్

తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ వివరణ ఇస్తూ వీడియో విడుదల చేసిన ఏఆర్ రెహమాన్(AR Rahman).

AR Rahman: నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి.. వివాదాస్పద కామెంట్స్ పై వివరణ ఇచ్చిన రెహమాన్

Rahman released video giving an explanation regarding the controversial comments.

Updated On : January 18, 2026 / 12:43 PM IST
  • రెహమాన్ మతపరమైన వివాదాస్పద కామెంట్స్
  • సోషల్ మీడియాలో మండిపడుతున్న నెటిజన్స్
  • వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన రహమాన్

AR Rahman: బాలీవుడ్‌ ఇండస్ట్రీలో విభజనపరమైన ధోరణులు పెరిగాయంటూ ఏఆర్ రెహమాన్‌ సంచలన కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. దాదాపు ఎనిమిదేళ్లుగా నాకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం సృజనాత్మకత లేని వ్యక్తులు చేతుల్లోకి పవర్ వెళ్ళింది. దీనికి, మతపరమైన అంశం కారణం కావచ్చ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

అలాగే ‘ఛావా’ సినిమాకు మ్యూజిక్ చేయడంపై కూడా ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అయితే, రెహమాన్(AR Rahman) చేసిన ఈ కామెంట్స్ పై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రెహమాన్ కామెంట్స్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తాను చేసిన కామెంట్స్ పై వివరణను ఇస్తూ వీడియో విడుదల చేశాడు రెహమాన్.

Rahasya Gorak: పండుగ పూట ప్రకృతిలో.. కిరణ్ అబ్బవరం భార్య రహస్య.. ఫొటోలు

ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “భారతదేశమే నా స్ఫూర్తి, నా గురువు, నా ఇల్లు. సంగీతం ఎప్పుడూ భారతీయ సంస్కృతితో అనుసంధానించే మార్గంగానే ఉంది. కొన్నిసార్లు నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కానీ, నా ఉద్దేశ్యం ఎప్పుడూ దేశాన్ని గౌరవించడం, సేవ చేయడం మాత్రమే. ఏ ఒక్కరినో బాధపెట్టడం నా ఉద్దేశ్యం కాదు. నా నిజాయితీని గుర్తిస్తారని అందరూ గుర్తిస్తారని కోరుకుంటున్నాను.

నా భారతదేశం బహుళ సంస్కృతులను ప్రోత్సహిస్తుంది. ప్రధానమంత్రి ఝాలా, నాగాలాండ్ సంగీతకారులతో కలిసి పనిచేయడం, మల్టీకల్చరల్ వర్చువల్ బ్యాండ్ ‘సీక్రెట్ మౌంటైన్’ చేశాను. ప్రస్తుతం హన్స్ జిమ్మర్‌తో కలిసి ‘రామాయణం’ సినిమాకు సంగీతం అందిస్తున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నా”అంటూ చెప్పుకొచ్చాడు రెహమాన్. దీంతో ఆయన చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.