Site icon 10TV Telugu

Rahul Sankrityan : ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. హీరో??

Rahul

Rahul

Rahul Sankrityan :   ఇటీవల యువ డైరెక్టర్స్ మంచి మంచి కథలతో సినిమాలు తీసి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. స్టార్ హీరోలు సైతం యువ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తున్నారు. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్. గతంలో విజయ్ దేవరకొండ తో ‘ట్యాక్సీ వాలా’ సినిమాతో మంచి విజయం సాధించాడు. ఇప్పుడు నానితో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా తీసి భారీ విజయం సాధించాడు. ఈ రెండు సినిమాలు కథ పరంగా, సాంకేతికత పరంగా చాలా బాగుంటాయి.

Shruthi Hassan : ‘బెస్ట్ సెల్లర్’గా శృతిహాసన్.. బాలీవుడ్ వెబ్ సిరీస్

వరుసగా మొదటి రెండు సినిమాలు హిట్ అవ్వడంతో ఈ యువ దర్శకుడికి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. తాజాగా సినీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రాహుల్ నెక్స్ట్ సినిమా కూడా ఓకే అయినట్టు తెలుస్తుంది. రాహుల్ నెక్స్ట్ సినిమా నాగచైతన్యతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మైత్రీ మూవీస్ వారికి కథ చెప్పి ఒప్పించాడట. చైతూ ప్రస్తుతం ‘థ్యాంక్యూ’ షూటింగ్ నిమిత్తం మాస్కోలో ఉన్నారు. అక్కడ నుంచి రాగానే సినిమా గురించి డిస్కషన్స్ జరిపి ఓకే చేస్తారని సమాచారం. చైతూ కూడా ఓకే అంటే నిర్మాత రెడీగా ఉన్నారు కాబట్టి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.

Exit mobile version