Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య వివాదం తరవాత ఒకసారి రాజ్ తరుణ్, లావణ్య మీడియా ముందుకు వచ్చి లావణ్య చేసేవన్నీ అబద్దపు ఆరోపణలు అని చెప్పి వెళ్లిపోయారు. అప్పట్నుంచి రాజ్ తరుణ్ బయటకి రాలేదు. తాజాగా రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా నేడు తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్లో మీడియా అడిగే పలు ప్రశ్నలకి ఇద్దరూ సమాధానాలు ఇచ్చారు.
Also Read : Malvi Malhotra – Lavanya : లావణ్య వివాదంపై స్పందించిన మాల్వి మల్హోత్రా.. ఆమె నాకు క్రిమినల్ తో సమానం..
అయితే లావణ్య వివాదం తర్వాత ఎందుకు బయట కనపడలేదు, మీ గత సినిమా పురుషోత్తముడు ప్రమోషన్స్ కి ఎందుకు రాలేదు అని ప్రశ్నించగా.. నేను మనిషినే, నాకు బాధేస్తుంది. నేను ఎఫెక్ట్ అవుతాను. వాళ్ళ లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేను. నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను. మన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఇలా చేస్తే నాకు బాధ వేయదా? ఆ బాధతోనే ఇన్నాళ్లు బయటకు రాలేదు. నేను మామూలుగానే సెన్సిటివ్ పర్సన్ అందుకే బయటకి రాలేదు. నేను ఇంకా అలాగే ఉండేవాడిని ఇంట్లో. మా పేరెంట్స్, ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకే ఇవాళ మీ ముందుకు వచ్చి సమాధానాలు చెప్పాలని బయటకి వచ్చాను. నేను చాలా ధైర్యం తెచ్చుకొని బయటకి వచ్చాను. ఇంకా ఇలాంటివి అడిగి బాధపెట్టకండి. నేను ఏదైనా లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. నా 32 ఏళ్ల జీవితం లో వేలాది మంది తెలిసి ఉన్నారు. ఎవరైనా ఒక్కరు వచ్చి నా మీద చెడుగా చెప్పమని చెప్పండి అని అన్నారు.