Malvi Malhotra – Lavanya : లావణ్య వివాదంపై స్పందించిన మాల్వి మల్హోత్రా.. ఆమె నాకు క్రిమినల్ తో సమానం..

లావణ్య వివాదం గురించి మీడియా ప్రశ్నించగా మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ..

Malvi Malhotra – Lavanya : లావణ్య వివాదంపై స్పందించిన మాల్వి మల్హోత్రా.. ఆమె నాకు క్రిమినల్ తో సమానం..

Malvi Malhotra Reaction on Lavanya Raj Tarun Case

Updated On : July 31, 2024 / 4:31 PM IST

Malvi Malhotra – Lavanya : గత కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే ఓ యువతి.. రాజ్ తరుణ్ తో పదేళ్లకు పైగా కలిసి జీవించానని, రాజ్ నన్ను పెళ్లి చేసుకొని అబార్షన్ చేయించాడని, హీరోయిన్ మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆరోపణలు చేసి కేసు పెట్టింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఈ విషయంలో ఆల్రెడీ రాజ్ తరుణ్ కు నోటీసులు కూడా పంపారు.

దీనిపై రాజ్ తరుణ్ ఒకే ఒక్కసారి స్పందించి.. ఆమెతో నాకు ఎప్పుడో బ్రేకప్ అయింది, ఆమెవన్నీ అబద్దపు ఆరోపణలు అని చెప్పి కనిపించకుండా వెళ్లిపోయాడు. మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై కేసు పెట్టి అనంతరం కనిపించకుండా మాయమయింది. గత కొన్ని రోజులుగా కనబడని రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా నేడు తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు.

Also Read : Raj Tarun – Lavanya : లావణ్య వివాదంపై ఎట్టకేలకు స్పందించిన రాజ్ తరుణ్.. నేను కొన్ని పేర్లు బయటపెట్టట్లేదు..

ఈ ఈవెంట్లో లావణ్య వివాదం గురించి మీడియా ప్రశ్నించగా మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. నాపై, నా బ్రదర్ పై ఆమె ఆరోపణలు చేసింది. దానికి పోలీసులకు నేను వివరణ ఇచ్చాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇటీవల కూడా ఆమె నాకు మెసేజ్ చేసింది లావణ్య. అది కూడా పోలీసులకు చూపించాను. నా ఫ్యామిలీ కానీ, నేను కానీ ఆమెని డైరెక్ట్ గా ఎప్పుడు కలవలేదు. ఆమె ఎందుకు ఇలా చేస్తుంది నాకు తెలీదు. ఆమె క్రిమినల్స్ తో తిరుగుతుంది. నాతో మిస్ బిహేవ్ చేసిన వాళ్ళతో ఆమె త్రిగుతుంది. ఆమె నాకు క్రిమినల్ తో సమానం. ఆమె గురించి నేను ఏమి మాట్లాడను. నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను ఏదైనా అని చెప్పింది.