Raj Tarun : రాజ్ తరుణ్ కొత్త సినిమా నుంచి.. మెలోడీ సాంగ్ విన్నారా..?
మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి.. (Raj Tarun)
Raj Tarun
Raj Tarun : రాజ్ తరుణ్, అమృత చౌదరి జంటగా ఆతెరకెక్కుతున్న సినిమా టార్టాయిస్. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మాణంలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీ పరిచయం..’ అంటూ సాగే మెలోడీ పాటను రిలీజ్ చేసారు. ఈ పాటను అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ రాయగా చిన్మయి శ్రీపాద, అనూప్ రూబెన్స్, జాన్హవి ఎర్రం పాడారు.
మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి..
Also Read : Sravanthi Chokarapu : కృష్ణాష్టమి స్పెషల్.. నెమలి పింఛంతో ‘యాంకర్ స్రవంతి’ స్పెషల్ ఫొటోలు..
సాంగ్ లాంచ్ ఈవెంట్లో లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ప్రేమ, ఆర్తి, అక్కెరతో కూడుకున్న పాట ఇది. ఈ పాటను అత్యద్భుతంగా అనూప్ కంపోజ్ చేస్తే అంతే అద్భుతంగా చిన్మయి పాడింది అన్నారు. నిర్మాత విజయ్ చౌదరి మాట్లాడుతూ.. నీ పరిచయం సాంగ్ మా మూవీకి పిల్లర్ లాంటిది. ఎమోషనల్ గా సాగే ఈ పాట మీ అందరినీ ఆకట్టుకుంటుంది. మా సినిమాను బడ్జెట్ లో చెప్పిన డేట్స్ లో క్లారిటీగా మా డైరెక్టర్ చేశారు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం అన్నారు. ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల మాట్లాడుతూ.. మా మూవీని అనుకున్న టైమ్ కు ప్లాన్ ప్రకారం కంప్లీట్ చేశాం. రాత్రిళ్లు, వర్షం పడుతున్నప్పుడు, చలిలో ఎప్పుడు షూటింగ్ ఉంటే అప్పుడు వచ్చిన మా హీరో రాజ్ తరుణ్ కు థ్యాంక్స్ అని అన్నారు. నిర్మాత రామిశెట్టి రాంబాబు మాట్లాడుతూ.. మా సినిమాను ఎంతో కష్టపడి, ఇష్టపడి నిర్మించాం. ఈ పాట మంచి లవ్ ఫీల్ తో సాగుతూ మీరు రిపీటెడ్ గా వినేలా చేస్తుంది అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు చూశా అమృత ఈ పాటలో చాలా బాగా పర్ ఫార్మ్ చేశారు. రాజ్ తరుణ్ ను ఇలాంటి పాత్రలో ప్రేక్షకులు ఊహించరు అని అన్నారు. డైరెక్టర్ రిత్విక్ కుమార్ మాట్లాడుతూ.. నీ పరిచయం అంటూ ఈ పాటను చంద్రబోస్ గారు ఏ ఇంటెన్షన్ తో రాశారో గానీ మేమంతా ఇండస్ట్రీకి తొలి పరిచయాలే. థ్రిల్లర్ సినిమాలో లవ్ ఎలిమెంట్ తీసుకొచ్చి దాన్ని టర్న్ చేస్తూ థ్రిల్లర్ లోకి తీసుకెళ్లే క్యారెక్టర్ చేశారు రాజ్ తరుణ్. పాట ఎంత బాగుందో చూశారు కదా సినిమా అంతకు మించి ఉంటుంది. బొమ్మరిల్లు, మజిలీ లాంటి సినిమాలను థ్రిల్లర్ చేస్తే ఎలా ఉంటుందో మా టార్టాయిస్ అలా ఉంటుంది. సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు. ఈ కథలో ఐదు ట్విస్టులు ఉంటాయి. ట్విస్ట్ లు ఎవరూ కనుక్కోలేరు అని అన్నారు.
Also See : Kushitha Kallapu : తిరుమలలో నటి కుషిత కళ్లపు.. ఫొటోలు..
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. మా మూవీ ఒక యూనిక్ థ్రిల్లర్. థియేటర్స్ లో మిమ్మల్ని కంప్లీట్ గా ఎంగేజ్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత అమృత చాలా తక్కువ టైమ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోతుంది అని అన్నారు.
