2024 Tollywood Controversies : 2024లో టాలీవుడ్ ని ఊపేసిన వివాదాలు ఇవే..

ఈ సంవత్సరం టాలీవుడ్ లో పెద్ద వివాదాలే అయ్యాయి అని చెప్పొచ్చు.

Raj Tarun To Allu Arjun 2024 Tollywood Controversies Here Details

2024 Tollywood Controversies : 2024లో టాలీవుడ్ లో ఎన్ని హిట్స్, ఎన్ని ఫ్లాప్స్ చూసినా చాలా మంది సినిమా స్టార్స్ సినిమాలతో గుర్తిపు తెచ్చుకున్నా కొంతమంది మాత్రం వివాదాలతో వైరల్ అయ్యారు. ఈ సంవత్సరం టాలీవుడ్ లో పెద్ద వివాదాలే అయ్యాయి అని చెప్పొచ్చు.

2024 లో టాలీవుడ్ వివాదాలు..

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ లేడీ కొరియోగ్రాఫర్ తనని మైనర్ గా ఉన్నప్పటి నుంచి శారీరికంగా వాడుకున్నాడని, పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేసాడని కేసు పెట్టింది. ఈ కేసులో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసారు. కొన్ని రోజులు జైలులో ఉండి విచారణ అనంతరం బెయిల్ మీద బయటకి వచ్చారు. ఈ కేసు టాలీవుడ్ లో బాగా చర్చగా మారింది. ఈ కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా హోల్డ్ లో పెట్టారు.

రాజ్ తరుణ్ కూడా ఈ సంవత్సరం బాగా వైరల్ అయ్యాడు. ఇటీవల అసలు హిట్స్ లేని రాజ్ తరుణ్ ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ వారం గ్యాప్ లో రెండు సినిమాలతో వచ్చాడు. ఆ సినిమాల సమయంలోనే ఓ మహిళ రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసాడు అంటూ మీడియా ముందుకు వచ్చింది. అయితే ఈ కేసులో ఆమె రోజుకొక మాట మాట్లాడటం, ఆమె గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటకు రావడం, రాజ్ తరుణ్ ఆమెని ప్రేమించిన మాట నిజమే కానీ ఎప్పుడో విడిపోయాము అంటూ చెప్పడం.. ఇలా ఓ నెల రోజుల పాటు ఈ వివాదం సాగింది.

Also Read : Mahesh – Mufasa : రేపే ‘ముఫాసా’ రిలీజ్.. మహేష్ పోస్ట్.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా .. వాయిస్ కే ఈ రేంజ్ రచ్చ..

నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా కూల్చేయడంతో చర్చగా మారింది. మంత్రి కొండా సురేఖ సమంత, నాగచైతన్యని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో నాగార్జున ఆమెపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదం కొన్నాళ్ళు వాడివేడిగా సాగగా కేసు మాత్రం ఇంకా కోర్టులో నడుస్తుంది.

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ బెంగుళూరులో డ్రగ్స్ కేసులో పట్టుబడటం, ఆ తర్వాత నేను డ్రగ్స్ తీసుకోలేదని హేమ వీడియోలు చేసి రిలీజ్ చేయడంతో ఈ డ్రగ్స్ కేసు కూడా టాలీవుడ్ లో కలకలం సృష్టించింది.

జ్యోతిష్యుడు వేణుస్వామి రెగ్యులర్ గా సినీ సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల కూడా నాగచైతన్య – శోభిత మీద వ్యాఖ్యలు చేయడంతో అతని మీద మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేయడం, అతను కోర్టుకెళ్లి తనని విచారించొద్దని స్టే తెచ్చుకోవడం, కోర్ట్ తర్వాత ఆ స్టే ని కొట్టేయడంతో ఈ వివాదం కొన్నాళ్ల పాటు సాగింది.

ఇటీవల అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ కి వెళ్లడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోవడం, ఆ మహిళ కుమారుడు తీవ్రంగా గాయపోయాడటంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు నడుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఆ బాలుడు ఇంకా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

మోహన్ బాబు ఇంట్లో మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ ఆస్తి గొడవలు ఇటీవల బయటకి వచ్చాయి. ఒకరి పై ఒకరు బౌన్సర్లతో దాడి చేయించడం, పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వడంతో మంచు కుటుంబం ఈ వివాదంతో రోడ్డెక్కింది.

ఇక డైరెక్టర్ ఆర్జీవీపై గతంలో పవన్, చంద్రబాబుపై చేసిన సోషల్ మీడియా పోస్టులను ఉద్దేశించి పలువురు కేసులు వేయడం, కొన్నాళ్ళు ఆర్జీవీ కనపడలేదని హైడ్రామా, కోర్టుకి వెళ్లి ఆర్జీవీ స్టే తెచ్చుకోవడంతో ఈ వివాదం సాగింది.

తాజాగా నటుడు, యూట్యూబర్ ప్రసాద్ బెహరా ఓ నటిని అసభ్యకరంగా తాకాడని, మాట్లాడాడు అని ఆ నటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ప్రసాద్ బెహరాని అరెస్ట్ చేసారు.