Mahesh – Mufasa : రేపే ‘ముఫాసా’ రిలీజ్.. మహేష్ పోస్ట్.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా .. వాయిస్ కే ఈ రేంజ్ రచ్చ..

రేపే ముఫాసా రిలీజ్ అవుతుండటంతో మహేష్ బాబు తన సోషల్ మీడియాలో..

Mahesh – Mufasa : రేపే ‘ముఫాసా’ రిలీజ్.. మహేష్ పోస్ట్.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా .. వాయిస్ కే ఈ రేంజ్ రచ్చ..

Mahesh Babu Post on Mufasa Movie Fans Celebrations at Theaters

Updated On : December 19, 2024 / 12:16 PM IST

Mahesh – Mufasa : హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ది లయన్ కింగ్ కి ప్రీక్వెల్ గా వస్తున్న ముఫాసా రేపు రిలీజ్ కానుంది. అయితే తెలుగులో ఈ సినిమాలోని మెయిన్ లీడ్ ముఫాసా సింహం పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు. ముఫాసా సినిమాకు మహేష్ సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా మీద తెలుగులో మంచి హైప్ రావడమే కాక ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Sankranthiki Vasthunam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి నెక్స్ట్ సాంగ్ వచ్చేసింది..

ఇక రేపే ముఫాసా రిలీజ్ అవుతుండటంతో మహేష్ బాబు తన సోషల్ మీడియాలో.. ముఫాసాకు వాయిస్ ఇవ్వడం ఒక అద్భుతమైన అనుభవం. ఇది ఎప్పుడూ నా మనసుకు హత్తుకుంటుంది. మీరు కూడా నాలాగే డిస్ని ముఫాసా చూసేటప్పుడు మంచి అనుభవాన్ని పొందుతారని భావిస్తున్నాను అని పోస్ట్ చేసారు. దీంతో మహేష్ పోస్ట్ వైరల్ అవ్వగా ఫ్యాన్స్ సినిమా కోసం, మీ వాయిస్ వినడం కోసం వెయిటింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా చేస్తుండటంతో ఆ సినిమా రావడానికి కనీసం మూడేళ్లు అయినా పట్టొచ్చు అని అంతా ఫిక్స్ అయ్యారు. అప్పటి వరకు బాబుని థియేటర్లో చూడలేమని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ముఫాసాకు మహేష్ వాయిస్ చెప్పాడు అని తెలియడంతో కనీసం బాబు వాయిస్ అయినా విందామని ఫ్యాన్స్ అంతా థియేటర్స్ వద్ద ఇప్పట్నుంచే రచ్చ చేస్తున్నారు.

సింహం, మహేష్ బాబు ఉన్న కటౌట్స్ అన్ని ఊర్లల్లో మెయిన్ థియేటర్స్ వద్ద పెడుతూ రచ్చ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందు కేవలం డబ్బింగ్ ఇచ్చినందుకు మహేష్ ఫ్యాన్స్ ఈ రేంజ్ లో రచ్చ చేస్తుంటే రేపు ముఫాసా థియేటర్స్ లో ఇంకెంత రచ్చ చేస్తారో, మహేష్ – రాజమౌళి సినిమాకు అయితే ఊహించలేము అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ముఫాసా సినిమాకు మహేష్ ఫ్యాన్స్ పెట్టిన కటౌట్స్, చేసే హడావిడి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.