Sankranthiki Vasthunam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి నెక్స్ట్ సాంగ్ వచ్చేసింది..

తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేసారు.

Sankranthiki Vasthunam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి నెక్స్ట్ సాంగ్ వచ్చేసింది..

Venkatesh Sankranthiki Vasthunam Movie Second Song Released

Updated On : December 19, 2024 / 11:18 AM IST

Sankranthiki Vasthunam Song : వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గోదారి గట్టు.. సాంగ్ రిలీజ్ చేయగా ఆ సాంగ్ పెద్ద హిట్ అయింది. తాజాగా ఈ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేసారు.

Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు డైలాగ్స్ రాసిన తమిళనాడు ఎంపీ..

‘నా లైఫ్ లో ఉన్న ఆ ప్రేమ పేజీ తీయనా.. పేజీలో రాసున్నా అందాల ఆ పేరు మీనా..’ అంటూ సాగిన ఈ పాట మెప్పిస్తుంది. ఈ సాంగ్ లో వెంకటేష్ పాత్ర తన భార్యకు తన ఎక్స్ గురించి పరిచయం చేస్తున్నట్టు ఉంది. ఇక ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో భీమ్స్, ప్రణవి ఆచార్య పాడారు. మీరు కూడా ఈ పాట వినేయండి..