Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు డైలాగ్స్ రాసిన తమిళనాడు ఎంపీ..

ఈ సినిమాకు కొన్ని డైలాగ్స్ ఓ రాజకీయ నాయకుడితో రాయించారట.

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు డైలాగ్స్ రాసిన తమిళనాడు ఎంపీ..

Tamilnadu Madurai MP S Venkatesan Wrote Dialogues for Ram Charan Game Changer Movie

Updated On : December 19, 2024 / 11:04 AM IST

Game Changer : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా భారీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ వచ్చి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాతికి జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.

గేమ్ ఛేంజర్ సినిమాను శంకర్ డైరెక్ట్ చేస్తున్నా ఈ కథ రాసింది మాత్రం తమిళ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. అయితే ఈ సినిమాకు కొన్ని డైలాగ్స్ ఓ రాజకీయ నాయకుడితో రాయించారట. తమిళనాడులో మధురై ఎంపీగా ఉన్న వెంకటేశన్ గేమ్ ఛేంజర్ సినిమాకు తమిళ్ లో డైలాగ్స్ రాసారంట. సిపిఐ పార్టీకి చెందిన వెంకటేశన్ ప్రస్తుతం మధురై ఎంపీగా ఉన్నారు.

Also Read : HariHara VeeraMallu : హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న స్టార్ రైటర్.. డైరెక్టర్ తో పాటే అంటూ..

గతంలో వెంకటేశన్ కొన్ని పుస్తకాలు కూడా రాసారు. ఆయన రాసిన కావల్ కొట్టం అనే పుస్తకానికి తమిళ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అలాగే ఇతను తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్, యాక్టర్స్ అసోసియేషన్ లో కూడా మెంబర్ గా ఉన్నారు. వెంకటేశన్ తో శంకర్ కు మంచి అనుబంధం ఉంది. ఆయనతో ఉన్న స్నేహంతో పాటు వెంకటేశన్ ట్యాలెంట్ చూసి గేమ్ ఛేంజర్ సినిమాలోని కొన్ని పొలిటికల్ సీన్స్ కు ఈయనతో తమిళ్ వర్షన్ డైలాగ్స్ రాయించాడు శంకర్. మరి ఆ డైలాగ్స్ ఏ రేంజ్ లో పేలతాయో చూడాలి.