HariHara VeeraMallu : హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న స్టార్ రైటర్.. డైరెక్టర్ తో పాటే అంటూ..

సినిమాకు మెయిన్ పిల్లర్ అయిన డైరెక్టర్ క్రిష్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

HariHara VeeraMallu : హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న స్టార్ రైటర్.. డైరెక్టర్ తో పాటే అంటూ..

Star Writer Burra Sai Madhav Out From Pawan Kalyan HariHara VeeraMallu

Updated On : December 19, 2024 / 9:58 AM IST

HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ పవన్ రాజకీయాల బిజీ వల్ల ఈ సినిమా చాలా లేట్ అయింది. ప్రస్తుతం ఫైనల్ దశ షూటింగ్ లో ఉంది. అయితే సినిమా చాలా లేట్ అవ్వడంతో ఈ సినిమా నుంచి చాలా మంది తప్పుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. సినిమాకు మెయిన్ పిల్లర్ అయిన డైరెక్టర్ క్రిష్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడంతో ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం తనయుడు, డైరెక్టర్ జ్యోతికృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే క్రిష్ ఎందుకు తప్పుకున్నాడో ఇప్పటికి క్లారిటీ లేదు. ఎవ్వరూ దాని గురించి మాట్లాడలేదు. తాజాగా స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ కూడా హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్నాను అని తెలిపాడు.

Also Read : Keerthy Suresh : తాళిబొట్టుతో ముంబై పార్టీకి వెళ్లిన కీర్తి సురేష్.. తెగ వైరల్ చేస్తున్న బాలీవుడ్ మీడియా.. వీడియోలు చూశారా?

గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. నేను కూడా ఎప్పుడో హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్నాను. డైరెక్టర్ క్రిష్ తో పాటే నేను కూడా బయటకు వచ్చేసాను. కానీ సినిమా మాత్రం అద్భుతమైన సబ్జెక్టు. నేను కూడా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

అయితే హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్నాను అని చెప్పారు కానీ ఎందుకు తప్పుకున్నారో, డైరెక్టర్ క్రిష్ ఎందుకు తప్పుకున్నారో మాత్రం చెప్పలేదు సాయి మాధవ్ బుర్రా. ఇక హరిహర వీరమల్లు సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా మార్చ్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.