Keerthy Suresh : తాళిబొట్టుతో ముంబై పార్టీకి వెళ్లిన కీర్తి సురేష్.. తెగ వైరల్ చేస్తున్న బాలీవుడ్ మీడియా.. వీడియోలు చూశారా?
తాజాగా కీర్తి సురేష్ పెళ్లి తర్వాత ముంబైలో జరిగిన ఓ బాలీవుడ్ పార్టీకి వెళ్ళింది.

Keerthy Suresh Appears in Bollywood Party with Mangalasutra after Marriage Videos goes Viral
Keerthy Suresh : కీర్తి సురేష్ ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లి చేసుకుంది. గోవాలో డిసెంబర్ 12న వీరి వివాహం మొదట హిందూ సంప్రదాయంలో ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగింది. పెళ్ళిలో తాళిబొట్టు కడతారని తెలిసిందే. కానీ చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి అయిన తర్వాత వాళ్ళ వర్క్ నేపథ్యంలో తాళిబొట్టు లేకుండానే బయటకు వస్తారు. పార్టీలలో, ఈవెంట్స్ లో పాల్గొంటారు.
Also Read : Pawan Kalyan : హరిహర వీరమల్లు, OG సినిమాల్లో ఐటెం సాంగ్స్.. పవన్ తో చిందులేసే ఆ భామలు..
ముఖ్యంగా బాలీవుడ్ లో పెళ్లయిన ఏ హీరోయిన్ కూడా తాళిబొట్టుతో కనిపించదు. తాజాగా కీర్తి సురేష్ పెళ్లి తర్వాత ముంబైలో జరిగిన ఓ పార్టీకి వెళ్ళింది. అక్కడికి మోడ్రన్ డ్రెస్సులో వెళ్లడమే కాకుండా మెడలో తాళిబొట్టుతో వెళ్ళింది. దీంతో కీర్తి సురేష్ మోడ్రన్ డ్రెస్ లో మంగళసూత్రంతో కనపడిన వీడియోలను బాలీవుడ్ మీడియా తెగ వైరల్ చేస్తుంది.
దీంతో పలువురు ఆమెని అభినందిస్తుంటే, మరికొంతమంది మాత్రం రీసెంట్ గానే కదా పెళ్లి అయింది అందుకే వేసుకుంది అని, కొంతమంది ఆ మోడ్రన్ డ్రెస్ మీద తాళిబొట్టు అవసరమా అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కీర్తి తన పెళ్లితో కంటే పెళ్లి తర్వాత పార్టీకి ఇలా తాళిబొట్టు కనిపించి బాలీవుడ్ లో బాగా వైరల్ అవుతుంది. ఇక కుర్తి సురేష్ నటించిన మొదటి బాలీవుడ్ సినిమా బేబీ జాన్ డిసెంబర్ 25 న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ప్రమోషన్స్ కోసం కీర్తి అక్కడే ముంబైలోనే ఉండనుంది.