Malavika Mohanan : ఆ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ చేసిన హీరోయిన్.. ఫొటోలు వైరల్.. ‘రాజాసాబ్’ షూట్ అయిపోయిందా?

తాజాగా మాళవిక మోహనన్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Malavika Mohanan : ఆ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ చేసిన హీరోయిన్.. ఫొటోలు వైరల్.. ‘రాజాసాబ్’ షూట్ అయిపోయిందా?

Raja Saab Actress Malavika Mohanan Shares post on an Action Scene

Updated On : October 8, 2024 / 3:23 PM IST

Malavika Mohanan : పలు తమిళ్ సినిమాలతో తెలుగు వాళ్లకు కూడా దగ్గరైన హీరోయిన్ మాళవిక మోహనన్. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్స్ తో అలరిస్తూ ఉంటుంది ఈ భామ. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాలో నటిస్తుంది. అయితే తాజాగా మాళవిక చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

మాళవిక యాక్షన్ సీక్వెన్స్ లు చేసేముందు శరీరానికి కట్టుకునే బెల్టులు అన్ని కట్టుకొని వాటితో దిగిన సెల్ఫీలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు షేర్ చేసి..సర్దార్ 2 సినిమా కోసం కొన్ని కష్టమైన స్టంట్ సీక్వెన్స్ లను షూట్ చేసాము. అవి చేసేటపుడు మా కాస్ట్యూమ్ ఎలా ఉంటుందో మీకు చూపించాలి అనుకున్నాను. ఇవి పై నుంచి మేము దూకేటప్పుడు రోప్స్ సాయంతో మమ్మల్ని గట్టిగా పట్టుకోడానికి ఉపయోగపడతాయి. తంగలాన్ సినిమా కోసం మొదటి సారి నేను రోప్ వర్క్స్ చేశాను, అప్పుడు కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రాక్టీస్ తో బాగా చేస్తున్నాను. కొన్ని సీన్స్ లో మాత్రం బాగా కష్టపడాల్సి వస్తుంది అని తెలిపింది.

Also Read : Kavya Thapar : సినిమా హిట్ అవ్వాలని నవరాత్రులు ఉపవాసం ఉంటున్న హీరోయిన్.. డెడికేషన్‌కి మెచ్చుకోవలసిందే..

ఈ పోస్ట్ తో మాళవిక మోహనన్ ప్రస్తుతం కార్తీ సర్దార్ 2 షూటింగ్ లో ఉందని తెలుస్తుంది. అయితే ఇటీవలే కొన్ని రోజుల క్రితం రాజాసాబ్ సెట్లో కనపడింది మాళవిక. అయితే రాజాసాబ్ షూటింగ్ అవ్వకపోయినా మాళవిక పోర్షన్ సినిమాలో షూట్ అయిపోయిందా లేక తర్వాత మళ్ళీ జాయిన్ అవుతుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి మాళవిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు, తమిళ్ లో బిజీగానే ఉంది.