చిన్నప్పటినుంచీ ఇంతే.. కళ్లతోనే మాట్లాడతావ్ – ‘రాజావారు రాణిగారు’ ట్రైలర్
కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ‘రాజావారు రాణిగారు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ‘రాజావారు రాణిగారు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
పల్లెటూరి నేపథ్యంలో రూపొందే ప్రేమకథలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి.. అదే కోవలో స్వచ్ఛమైన ప్రేమకథగా ‘రాజావారు రాణిగారు’ చిత్రం తెరకెక్కింది. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌లను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో, ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్స్, మీడియా9 పతాకాలపై మనోవికాస్, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, యంగ్ హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, యూనిట్‌ని అభినందించారు.
Read Also : సుమంత్ ‘కపటధారి’ మోషన్ పోస్టర్
ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, యాక్టింగ్, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. నవంబర్ 29న ‘రాజావారు రాణిగారు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. కెమెరా : విద్యా సాగర్, అమర్ దీప్, ఎడిటింగ్ : విప్లవ్, మ్యూజిక్ : జై క్రిష్, లిరిక్స్ : భరద్వాజ్, రాకేందు మౌళి.