Rajamouli : కొత్త కార్ కొన్న దర్శకధీరుడు.. కాస్ట్ ఎంతో తెలుసా??
తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కొత్త కారును కొనుగోలు చేశారు. వోల్వో ఎక్స్‌సి40 అనే కారుని కొన్నారు రాజమౌళి. ఈ సందర్భంగా వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు......

Rajamouli
Rajamouli : బాహుబలి సినిమాతో దేశం మొత్తం తనవైపుకు తిప్పుకున్నాడు రాజమౌళి. బాహుబలి 2 సినిమాతో మరోసారి తన సత్తా చాటి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. చరణ్, తారక్ లతో మల్టీస్టారర్ గా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి త్వరలో మహేష్ బాబుతో సినిమా తెరకెక్కించనున్నారు.
Sunitha : మీకు దండం రా నాయనా.. తల్లి కాబోతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన సునీత..
తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కొత్త కారును కొనుగోలు చేశారు. వోల్వో ఎక్స్‌సి40 అనే కారుని కొన్నారు రాజమౌళి. ఈ సందర్భంగా వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు తాళాలను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను వోల్వో కార్స్ ఇండియా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలని పోస్ట్ చేసి..”మేము వోల్వో కార్ ఇండియా కుటుంబానికి ఫిల్మ్ డైరెక్టర్ మరియు స్క్రీన్ రైటర్ రాజమౌళిని సవినయంగా స్వాగతిస్తున్నాము. అతని దార్శనికతలతో సమానంగా అతనికి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాలు జరగాలని మేము కోరుకుంటున్నాము” అంటూ పోస్ట్ చేశారు. రెడ్ కలర్ లో ఉన్న ఈ వోల్వో కారు ధర దాదాపు 45 లక్షలు ఉంటుందని సమాచారం.