Celebrating ANR 100 : ఆ ఇమేజ్ పోగొట్టుకోడానికి.. ఎన్టీఆర్ పక్కన కమెడియన్‌గా ఏఎన్నార్..

స్టార్ హీరో అయ్యుండి ఎన్టీఆర్ పక్కన కమెడియన్ గా ఎందుకు చేశారని రాజమౌళి అడిగిన ప్రశ్నకు ఏఎన్నార్ ఇచ్చిన జవాబు..

Rajamouli comments on ANR NTR roles in Missamma movie

Celebrating ANR 100 : తెలుగు సినిమా పరిశ్రమలో ఒక లెజెండ్ గా ఎదిగిన నటుడు ‘అక్కినేని నాగేశ్వరరావు’ (Akkineni Nageswara Rao).. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో 1924 సెప్టెంబర్ 20న జన్మించారు. నేడు ఆయన 100వ జయంతి కావడంతో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) లో అక్కినేని ఫ్యామిలీ ఏఎన్నార్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక ఈ విగ్రహావిష్కరణ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నివాళులు అర్పించారు.

Venkaiah Naidu : రాజకీయ వారసత్వం v/s సినిమా వారసత్వం.. నెపోటిజం పై వెంకయ్య నాయుడు కామెంట్స్..

ఇక ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి కూడా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ చెప్పాడు. ఏఎన్నార్ సినిమాలు చూస్తూ పెరిగిన రాజమౌళి.. నాగేశ్వరరావుని ఒక సందర్భంలో మాత్రమే కలుసుకొని మాట్లాడినట్లు తెలియజేశాడు. ఆ సమయంలో తనకి ఉన్న ఒక సందేహం తీర్చుకున్నాడట. నందమూరి తారక రామారావు (NTR), నాగేశ్వరరావు కలిసి ఎన్నో సినిమాల్లో చేశారు. వాటిలో ఒకటి ‘మిస్సమ్మ’ సినిమా కూడా. ఈ సినిమాలో ఎన్టీఆర్ మెయిన్ హీరో, ఏఎన్నార్ కమెడియన్ టైపు రోల్‌లా కనిపిస్తుంది.

Venkaiah Naidu : నేటి సినిమా మేకర్స్ పై వెంకయ్య నాయుడు విమర్శలు.. డబల్ మీనింగ్ డైలాగ్స్..

అప్పటికి ఏఎన్నార్ స్టార్ హీరో. అలాంటిది ఆయన అలాంటి పాత్రలో ఎలా చేశారని రాజమౌళి ఏఎన్నార్ ని ప్రశించాడట. దానికి ఏఎన్నార్ బదులిస్తూ.. “ఆ పాత్ర నేను కావాలని చేసింది. నాగిరెడ్డి, చక్రపాణి నాకు బాగా క్లోజ్ అవ్వడంతో ఆ సినిమా కథ ఒక సందర్భంలో నాకు చెప్పారు. మూవీలోని ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. నేను చేస్తాను అని వాళ్ళకి చెప్పను. అందుకు ముందుగా వాళ్ళు కూడా నిరాకరించారు. అలాంటి పాత్రలో నిన్ను చూపిస్తే నీ ఫ్యాన్స్ మమ్మల్ని తిడతారు అని చెప్పారు. కానీ నేను పట్టుబట్టి చేశాను. ఎందుకంటే ‘దేవదాసు’ సినిమా తరువాత నాకు అన్ని తాగుబోతు క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఆ ఇమేజ్ ని పోగొట్టుకోకపోతే ఇబ్బంది అవుతుందని ఆ పాత్రని చేశాను” అని చెప్పాడట.

ట్రెండింగ్ వార్తలు