×
Ad

Rajamouli : ఇండియాలో ‘అవతార్’ ప్రమోషన్స్ చేస్తున్న రాజమౌళి.. జేమ్స్ కామెరాన్ తో స్పెషల్ వీడియో ఇంటర్వ్యూ..

అవతార్ పార్ట్ 3 ఫైర్ అండ్ ఆష్ సినిమా డిసెంబర్ 19 న రిలీజ్ కానుంది.(Rajamouli)

Rajamouli

Rajamouli : హాలీవుడ్ ఫేమస్ ఫిలిం సిరీస్ అవతార్ నుంచి మూడో సినిమా రాబోతుంది. అవతార్, అవతార్ 2 సినిమాలతో దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించగా ఇప్పుడు మూడో భాగంతో రాబోతున్నాడు. ఇండియాలో కూడా అవతార్ సినిమాలకు మంచి మార్కెట్, ఫాలోయింగ్ ఉంది. దీంతో అవతార్ 3 సినిమాని ఇండియాలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.(Rajamouli)

అవతార్ పార్ట్ 3 ఫైర్ అండ్ ఆష్ సినిమా డిసెంబర్ 19 న రిలీజ్ కానుంది. ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో ఇండియాలో కూడా కొంత ప్రమోషన్స్ చేస్తున్నారు ఈ సినిమాకు. ఈ క్రమంలో జేమ్స్ కామెరాన్ మన దర్శకధీరుడు రాజమౌళితో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.

Also Read : Rowdy Janardhan : రౌడీ ఫ్యాన్స్ కి నిరాశే.. ‘రౌడీ జనార్దన్’ టీజర్ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..

హాలీవుడ్ లో జేమ్స్ కామెరాన్ కూర్చొని ఇక్కడ రాజమౌళితో వీడియో ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి, జామ్ కామెరాన్ అనేక ఆసక్తికర విషయాలు అవతార్ సినిమా గురించి మాట్లాడారు. అవతార్ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్‌లో పిల్లవాడిలా చూస్తుండిపోయాను అని రాజమౌళి అన్నారు. హైదరాబాద్‌ ఐమాక్స్ లో అవతార్ సినిమా ఏడాది పాటు ప్రదర్శించబడిందని రాజమౌళి జేమ్స్ కామెరాన్ కి తెలిపారు. అలాగే అవతార్ ఫ్రాంచైజీ అద్భుతమైన బిగ్ స్క్రీన్ అనుభవాలకు బెంచ్‌మార్క్‌గా ఉంటుందని రాజమోళి అన్నారు.

కామెరాన్ కూడా రాజమౌళి సినిమాటిక్ విజన్‌ను అభినందించి, ఇండియన్ ఫిల్మ్ సెట్‌ను సందర్శించాలని ఉందని తెలిపారు. దీంతో రాజమౌళితో జేమ్స్ కామెరాన్ చేసిన ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read : Jabardasth Comedian : వామ్మో ఈ లేడీ గెటప్ ఆర్టిస్ట్ కి 200 కోట్ల ఆస్తా? జబర్దస్త్ లో రిచెస్ట్ కమెడియన్ ఇతనే..

మీరు కూడా రాజమౌళితో జేమ్స్ కామెరాన్ ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..