Rrr
RRR: ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పుడు ముమ్మర షూటింగ్ దశలో ఉంది. మరో రెండు నెలల్లో విడుదల నేపథ్యంలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసే పనిలో టీమ్ నిమగ్నమయ్యారు. మిగిలి ఉన్న పాటల చిత్రీకరణ కోసం ఉక్రెయిన్ వెళ్లారు. కాగా ఉక్రెయిన్ షూటింగ్ సెట్స్ లో పాల్గొంటున్న నటులకు సాంకేతిక నిపుణులకు ఆర్ఆర్ఆర్ టీం ఐడీ కార్డ్స్ జారీ చేసి మరీ పగడ్బంధీగా షూటింగ్ చేస్తున్నారు. ఒకపక్క షూటింగ్ జరుగుతుండగానే సినిమా ప్రచారం కూడా మొదలైపోయింది.
కేవలం ప్రమోషన్ కోసమే ఏకంగా ఓ స్పెషల్ టీంను కూడా బిల్డప్ చేసిన రాజమౌళి సినిమాతో సమానంగా ప్రమోషన్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే ఈ టీం నుండి వచ్చిన మేకింగ్ వీడియో, దోస్తీ వీడియోలు వైరల్ అయ్యాయి. అదలా ఉండగానే జక్కన్న కూడా ప్రమోషన్ పెంచే పనిలో పడ్డాడు. ఈ మధ్యనే ఐడీ కార్డు ధరించిన ఎన్టీఆర్ ఫోటో వైరల్ కాగా.. ఇప్పుడు చెర్రీ, తారక్ లతో కలిసి జక్కన్న ఫన్నీ మూమెంట్ ఒకటి వైరల్ అవుతుంది.
ఈ వీడియో కూడా జక్కన స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోస్ట్ చేసిన నిమిషాల్లోనే తెగ వైరల్ అవుతుంది. రామరాజు, భీమ్ షూటింగ్ మధ్యలో ఇలా ఉంటారని రాజమౌళి కామెంట్స్ చేయగా.. ఈ వీడియోలో తారక్, చెర్రీ పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటుండగా రాజమౌళి ఆ మూమెంట్స్ కెమెరాలో బంధించే ప్రయత్నం చేస్తుంటే చెర్రీ కట్ అని చెప్తున్నారు. ఇప్పటికే మెగా మల్టీస్టారర్ గా హైప్ తెచ్చుకున్న ఈ సినిమాతో మెగా, నందమూరి అభిమానులు ఖుషీ అవుతుండగా ఇలాంటి వీడియోలతో అభిమానులకు అంతులేని ఆనందంగా మారుతుంది.