Rajamouli : మహేష్ ఫ్యాన్స్ కి పండగే.. రాజమౌళి ఈసారి చాలా ఫాస్ట్..
ఆల్రెడీ వారణాసి సినిమా 2027లో ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. (Rajamouli)
Rajamouli
Rajamouli : భారీ స్టార్ కాస్ట్, నెవర్ బిఫోర్ మేకింగ్ తో సినిమాలు చేసే రాజమౌళి.. ప్రతీదీ లేట్ చేస్తారని, తనకి కావాల్సింది వచ్చే వరకూ షాట్ తీస్తూనే ఉంటారని అందరికీ తెలుసు. భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రాజమౌళి. అయితే రాజమౌళి ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒకెత్తు. ఇప్పుడు మహేశ్ బాబు తో చేస్తున్న వారణాశి మరో ఎత్తు. వారణాశి దాదాపు 1000కోట్ల బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్ తో హాలీవుడ్ టార్గెట్ గా తెరకెక్కుతోంది. ఇంత పెద్ద సినిమాని ఈ నెలలోనే కంప్లీట్ చేస్తానని రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనౌన్స్ చేశారు.
ఆల్రెడీ వారణాసి సినిమా 2027లో ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. ఇంత తక్కువ టైం లో రాజమౌళి అంత పెద్ద సినిమాని పూర్తి చేస్తారా అనే సందేహం కలుగుతుంది అందరికి. ఇలాంటి సమయంలో వారణాశిని ఈ నెలలోపే కంప్లీట్ చేస్తానని రాజమౌళి చెప్పారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 90 పర్సెంట్ కంప్లీట్ అయ్యిందని, సెప్టెంబర్ లో షూటింగ్ ని మ్యాగ్జిమమ్ కంప్లీట్ చేస్తారని టాక్ నడుస్తోంది.
Also See : Irumudi Actress Sam : 80s లుక్స్‌లో ఇరుముడి నటి సామ్.. ఎంత అందంగా ఉందో.. ఫోటోలు..
టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నసినిమా షూటింగ్ ఈ నెలలో కంప్లీట్ చేసి.. బ్యాలెన్స్ గ్రాఫిక్స్, సీజీ వర్క్ మీద ఫోకస్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి. ఇప్పటికే డబ్బింగ్, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ వర్క్ ని ప్యార్లల్ గా చేస్తున్న టీమ్ ఇక పై స్పీడ్ పెంచబోతున్నారు.
బాహుబలి దగ్గరనుంచి రాజమౌళి చేస్తున్న సినిమాలన్నీ భారీవే కావడంతో ప్రొడక్షన్ డిలే తో రిలీజ్ కూడా లేటవుతున్నాయి. కానీ ఈ సారి మాత్రం అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఏప్రిల్ లో సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి పక్కా ప్లాన్ చేసుకున్నారు రాజమౌళి అండ్ టీమ్. మహేశ్ బాబు ఈ సినిమాలో ట్రావెలర్ గా, రాముడిగా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారు.
మందాకిని గా ప్రియాంకా చోప్రా, నెగెటివ్ క్యారెక్టర్ లో పృధ్విరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ క్రేజీ స్టార్ కాస్ట్ తో మ్యాసివ్ మేకింగ్ తో వస్తున్న వారణాశి మరి రాజమౌళి చెప్పిన డేట్ కి రిలీజ్ చేస్తారా లేదా చూడాలి. షూటింగ్ అయితే త్వరగా పూర్తి అవుతున్నందుకు మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి 1000కోట్ల బడ్జెట్ కి మహేశ్ బాబు యాక్టింగ్, రాజమౌళి టేకింగ్ ఏరేంజ్ లో కలెక్షన్లు రాబడతారో చూడాలి.
