Rajamouli - Prabhas
Rajamouli – Prabhas : బాహుబలి ఎపిక్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా ఇందులో బోలెడన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో రాజమౌళి ప్రభాస్ గురించి ఓ విషయం తెలిపారు.(Rajamouli – Prabhas)
రాజమౌళి సినిమా ఒప్పుకుంటే ఆ హీరో ఇంకో సినిమా చేయడానికి వీల్లేదని తెలిసిందే. ఈ విషయంలో రాజమౌళి చాల స్ట్రిక్టుగా ఉంటారు. మొదటి ఎన్టీఆర్ సినిమా నుంచి ఇప్పుడు మహేష్ బాబు సినిమా వరకు కూడా అందరు హీరోలు రాజమౌళి సినిమా చేస్తుంటే మధ్యలో వేరే సినిమా చేయలేదు. బాహుబలి ఒప్పుకున్నాక ఆ సినిమా షూట్ ఆలస్యం అయ్యేలా ఉందని రాజమౌళి పర్మిషన్ తీసుకొని ప్రభాస్ మిర్చి సినిమా చేసిన సంగతి ప్రభాస్, రాజమౌళి గతంలో తెలిపారు.
Also Read : Rajamouli : బాహుబలి డిజాస్టర్ టాక్.. పార్ట్ 2 చూసి నిద్ర రావడంతో అది కూడా ఫ్లాప్ అనుకున్న రాజమౌళి..
తాజాగా రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలి 1 రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత పార్ట్ 2 మొదలుపెట్టడానికి ఎనిమిది నెలలు టైం వచ్చింది. సెట్స్ వేసుకోడానికి ఓ నాలుగు నెలలు, ప్రీ ప్రొడక్షన్ కి ఇంకో నాలుగు నెలలు టైం పడుతుందని ప్రభాస్ ని పిలిచి కావాలంటే ఇంకో సినిమా చేసుకో అని చెప్పాను. దాంతో ప్రభాస్.. ఇంకో సినిమానా? బాహుబలి 1 & 2 కి మధ్య ఇంకో సినిమా చేయాలా ఏం మాట్లాడుతున్నావ్ డార్లింగ్ అన్నాడు. నేను 8 నెలలు టైం పడుతుంది పార్ట్ 2 మొదలవ్వడానికి అంటే అయినా అక్కర్లేదు నేను హ్యాపీగా ఖాళీగా కుర్చుంటాను అన్నాడని తెలిపారు.
దీంతో రాజమౌళి వేరే సినిమా చేసుకోమని ఆఫర్ ఇచ్చినా ప్రభాస్ బాహుబలి లుక్, ఆ సినిమా అనుభవం డిస్టర్బ్ అవ్వకూడదు అని ఇంకో సినిమా చేయకుండా 8 నెలలు ఖాలీగా ఉన్నట్టు తెలుస్తుంది.