Rajamouli : ప్ర‌ముఖ ర‌చ‌యిత మృతిపై రాజ‌మౌళి సంతాపం.. బాధగా ఉంది..

ప్ర‌ముఖ మ‌ల‌యాళ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ క‌న్నుమూశారు.

Rajamouli pays tribute to Malayalam lyricist Mankombu Gopalakrishnan

మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ క‌న్నుమూశారు. గ‌త కొన్ని రోజులు ఆయ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కేర‌ళ రాష్ట్రంలోని కొచ్చిలోని ఓ ఆస్ప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న తుది శ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్ కార‌ణంగా ఆయ‌న ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స్థానిక మీడియా పేర్కొంది.

మంకొంబు గోపాలకృష్ణన్ మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. ద‌ర్శ‌క దీరుడు రాజ‌మౌళి సైతం ఈ లెజండ‌రీ రైట‌ర్ మృతి పై సంతాపం వ్య‌క్తం చేశారు.

Kangana Ranaut : ఆ సిల్లీ ఆస్కార్ ని అమెరికానే ఉంచుకోమను.. ఎమర్జెన్సీ మూవీపై కంగనా

‘రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ స‌ర్ ఇక లేర‌న్న‌ది త‌లుచుకుంటే బాధ‌గా ఉంది. ఆయ‌న సాహిత్యం, క‌విత్వం, సంబాష‌ణ‌లు ఎంతో ప్ర‌భావం చూపాయి. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ మలయాళ వెర్షన్లలో ఆయనతో కలిసి పనిచేసినందుకు కృతజ్ఞుడిని.’ అని సోష‌ల్ మీడియాలో రాజ‌మౌళి తెలిపారు.

Sukumar : సుకుమార్ నెక్ట్స్‌బిగ్ ప్రాజెక్ట్ ఇదే..!

మంకొంబు గోపాలకృష్ణన్ 1970ల్లో మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 200 సినిమాల్లో 700కి పైగా పాట‌ల‌ను రాశాను. డైలాగ్ రైట‌ర్‌గానూ మంచి గుర్తింపు సాధించారు. 2023లో విడుద‌లైన యానిమ‌ల్ చిత్ర మ‌ల‌యాళ వెర్ష‌న్‌లో పాట‌లు రాశారు.