Rajamouli Planning Mahesh Babu Movie Next Schedule in sets and cancelled Shoot at That City
Rajamouli : మహేశ్ -రాజమౌళి ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా మీద ఫస్ట్ నుంచి ఓవర్ హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు రాజమౌళి కూడా అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం, కనీసం ఫోటోలు కూడా రిలీజ్ చెయ్యకపోవడంతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ మరీ పెరిగిపోతోంది. ఇదే అత్యుత్సాహంతో మహేశ్ సినిమా షూటింగ్ అయ్యేటప్పుడు లీక్ చేసిన వీడియోతో రాజమౌళికి పెద్ద చిక్కే వచ్చిపడింది.
ఇప్పటికే ఆ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మున్ముందు కూడా అవుట్ డోర్ షూట్స్ చేస్తే ఇలాంటి లీకులు తప్పవని రాజమౌళి భావించి ఓ నిర్ణయం తీసుకున్నారట. రాజమౌళి ఇక పై ఇండియాలో అవుట్ డోర్ షూటింగ్స్ ఎత్తేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అడ్వెంచర్ యాక్షన్ మూవీగా రాబోతున్న మహేష్ రాజమౌళి సినిమా నుంచి వీడియోలు లీక్ అవ్వడం, ఎంత సెక్యూరిటీ పెంచినా లీక్ అవ్వవని గ్యారంటీ లేకపోవడంతో ఇక అసలు అవుట్ డోర్ షూట్స్ మ్యాగ్జిమమ్ అవాయిడ్ చేద్దామని డిసైడ్ అయ్యారట రాజమౌళి అండ్ టీమ్. దీనికోసమే కాశీలో జరగాల్సిన వచ్చే షెడ్యూల్ ని సెట్స్ లోనే చేద్దామని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దీనికోసం హైదరాబాద్ లో భారీ కాశీ సెట్ రెడీ చేస్తున్నట్టు టాక్.
కాశీ లో షూటింగ్ తో పాటు రియల్ లొకేషన్స్ లో షూటింగ్ వల్ల గ్యారంటీగా సీన్స్ లీక్ అయ్యే చాన్సుంది. అందుకే ఈసారి ఆ ఇబ్బంది లేకుండా భారీసెట్స్ లోనే సినిమా చెయ్యడానికే ప్రిఫర్ చేస్తున్నారట రాజమౌళి. అడ్వెంచర్ యాక్షన్ మూవీ అయినా ఈ సినిమాలో కాశీ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ సీన్స్ తెరకెక్కించాల్సి ఉందని, ఇలాంటి పరిస్తితుల్లో అవుట్ డోర్ షూట్స్ చెయ్యడం చాలా కష్టమని తేల్చింది టీమ్.
Also Read : Prabhas – Court Movie : నాని ‘కోర్ట్’ సినిమాకు వెళ్తే.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు..
ఇప్పటికే ఒడిశాలో ప్రియాంకా చోప్రా, మహేశ్, పృధ్విరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో షూటింగ్ జరుగుతోంది. మరి ఇండోర్ లో సెట్స్ మధ్య షూటింగ్ అయితే లీకులకి ఎలాంటి చాన్స్ ఉండదని, సినిమా మీద సస్పెన్స్ మెయింటెన్ అయ్యి ఉంటుందని రాజమౌళి అండ్ టీమ్ డిసైడ్ అయ్యింది. మరి ఈ ప్లాన్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో, ఇప్పటికైనా లీకులు ఆగుతాయో లేదో చూడాలి. అయితే విదేశాల్లో షూటింగ్ చేయాలనుకున్న సీన్స్ మాత్రం అక్కడికే వెళ్లి తీస్తారని తెలుస్తుంది.