Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ఆల్రెడీ బిగ్ మాస్ హీరో.. రాజమౌళి!

ఛత్రపతి రీమేక్ రిలీజ్ అవుతుండడంతో రాజమౌళి మూవీ టీంకి విషెస్ తెలియజేస్తూ.. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ఆల్రెడీ బిగ్ మాస్ హీరో అంటూ కామెంట్స్ చేశాడు.

Rajamouli said Bellamkonda Sreenivas is already big mass hero in bollywood

Bellamkonda Sreenivas : టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి (Chatrapathi) రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన ఛత్రపతి టాలీవుడ్ లో సూపర్ హిట్టుగా నిలిచి ప్రభాస్ కి మాస్ హీరో ఇమేజ్ ని సొంతం చేసింది. ఇప్పుడు ఇదే సినిమాతో బాలీవుడ్ లో మాస్ హీరోగా ఎదగడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ ని ఎంచుకున్నాడు.

VD12 : విజయ్ దేవరకొండ సినిమా ఆ మూవీకి కాపీ.. పోస్టర్ వైరల్!

బెల్లంకొండ మొదటి సినిమా అల్లుడు శీనుతో తనకి అదిరిపోయే డెబ్యూట్ ని అందించిన వినాయక్.. బాలీవుడ్ లో కూడా అటువంటి డెబ్యూట్ నే అందిస్తాడనే నమ్మకంతో ఉన్నాడు శ్రీనివాస్. కాగా ఈ హీరోకి హిందీ మార్కెట్ లో ఆల్రెడీ మంచి ఫేమ్ ఉంది. శ్రీనివాస్ నటించిన టాలీవుడ్ మూవీస్ అన్ని యూట్యూబ్ లో హిందీలోకి డబ్ అయ్యి రిలీజ్ అవుతుంటాయి. ఆ సినిమాల్లో శ్రీనివాస్ మాస్ యాక్షన్ కి బాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యిపోయారు. దీంతో బి-టౌన్ లో డెబ్యూట్ కి కంటే ముందే మాస్ హీరో ఇమేజ్ ని సొంత చేసుకున్నాడు.

Ram Pothineni : రామ్, బోయపాటి మూవీ గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్.. టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ రాజమౌళి వ్యాఖ్యలు చేశాడు. మే 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో మూవీ టీంకి రాజమౌళి విషెస్ తెలియజేశాడు. ఈ క్రమంలోనే రాజమౌళి మాట్లాడుతూ.. “బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ బెల్ట్ లో ఆల్రెడీ బిగ్ మాస్ హీరో. ఛత్రపతి కథ తనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది” అంటూ కామెంట్స్ చేశాడు. అలాగే ఈ సినిమాని వినాయక్ రీమేక్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ తెలియజేశాడు. మరి శ్రీనివాస్ కి ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్ ని అందిస్తుందో చూడాలి.