×
Ad

Rajamouli : ఎంత మాటన్నావు రాజమౌళి.. హనుమంతుడి మీద అలా.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..

ఈ ఈవెంట్లో రాజమౌళి దేవుడి మీద, హనుమంతుడి మీద చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. (Rajamouli)

Rajamouli

Rajamouli : రాజమౌళి – మహేష్ బాబు సినిమా వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ నిన్న రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి భారీగా మహేష్ ఫ్యాన్స్ హాజరయ్యారు. ఈవెంట్లో సంచారి సాంగ్ పెర్ఫార్మ్ చేసారు. టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఈవెంట్లో మూవీ యూనిట్ అంతా మాట్లాడారు.(Rajamouli)

అయితే ఈ ఈవెంట్లో రాజమౌళి దేవుడి మీద, హనుమంతుడి మీద చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read : Rajamouli : రాజమౌళి సినిమాకు కష్టాలు.. అందుకే వారణాసి ఈవెంట్.. నిర్మాతగా రాజమౌళి కొడుకు మాట్లాడటంతో..

ఈ ఈవెంట్లో వారణాసి రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. హనుమంతుడు రాజమౌళి వెనక ఉండి ఈ సినిమాని నడిపించారు అని అన్నారు. అయితే ఈ ఈవెంట్లో కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఆలస్యంగా ఈవెంట్ మొదలైంది. రాజమౌళి చాలా ప్లానింగ్ అసహనానికి గురయ్యాడు.

ఈ క్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. నాకు దేవుడి మీద నమ్మకం లేదండి. ఇందాక నా తండ్రి విజయేంద్రప్రసాద్ నాతో మాట్లాడుతూ టెన్షన్ పడకు అంతా హనుమ చూసుకుంటాడు, వెనకుండి నడిపిస్తాడు అన్నారు. కానీ ఇందాక సాంకేతిక లోపం కారణంగా ఈవెంట్ ఆగినప్పుడు ఇలానేనా నడిపించేది అని కోపం వచ్చింది. నా భార్య రమ కు హనుమాన్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఓ ఫ్రెండ్ లా మాట్లాడుతుంది. కానీ ఎందుకు ఇలా అయిందని కోపం వచ్చింది అన్నారు.

Also Read : Rajamouli : నిజంగా మహేష్ బాబు గ్రేట్.. ఈ రోజుల్లో అసలు అలా ఉండగలరా.. రాజమౌళి వ్యాఖ్యలు వైరల్..

దీంతో రాజమౌళి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సాంకేతికంగా మీ దగ్గర ఏదో సమస్య వస్తే దేవుడ్ని అంటావా, చిన్న చిన్న సమస్యలకు కూడా దేవుడ్ని నిందిస్తావా అని నెటిజన్లు, భక్తులు ఫైర్ అవుతున్నారు. దేవుడి మీద నమ్మకం లేదు అంటావు కానీ దేవుడి పేరు మీద సినిమాలు తీసుకుంటూ డబ్బులు సంపాదిస్తావా అని విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి రాజమౌళి మహేష్ సినిమా ఈవెంట్ ఏమో కానీ రాజమౌళి హనుమంతుడి మీద , దేవుడి మీద చేసిన వ్యాఖ్యలతో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు. పలు హిందూ సంఘాలు కూడా ఆయన్ని తప్పుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి దీనిమీద స్పందించకపోతే ఈ ఘటన తీవ్రంగా మారడం ఖాయం అంటున్నారు.