Rama Rajamouli : మగధీర సమయంలో యాక్సిడెంట్.. భార్యని చూసి ఏడ్చేసిన రాజమౌళి..
రాజమౌళి ఓ ఎమోషనల్ సంఘటనని షేర్ చేసుకున్నారు.
Rama Rajamouli : మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు అన్ని సూపర్ హిట్ సినిమాలే చేసిన సంగతి తెలిసిందే. ప్రతి సినిమాని భారీగా తెరకెక్కించారు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో తాజాగా నెట్ ఫ్లిక్స్ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో డాక్యుమెంటరీ తెరకెక్కించింది.
మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీలో రాజమౌళి, రాజమౌళి సన్నిహితులు పలువురు బోలెడు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో రాజమౌళి ఓ ఎమోషనల్ సంఘటనని షేర్ చేసుకున్నాడు.
Also Read : Rocking Rakesh – Sujatha : తల్లి తండ్రులు కాబోతున్న జబర్దస్త్ జంట..
రాజమౌళి మాట్లాడుతూ.. మగధీర షూటింగ్ సమయంలో మాకు యాక్సిడెంట్ అయింది. మేము ఒక రిమోట్ ప్లేస్ లో డ్రైవ్ చేస్తూ వస్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. అందరికి గాయాలు అయ్యాయి. రమకి నడుము కింద స్పర్శ కూడా పోయింది. ఆల్మోస్ట్ పక్షవాతం వచ్చింది అనుకున్నాము. దగ్గర్లో హాస్పిటల్ కూడా లేదు. తెల్సిన డాక్టర్స్ అందరికి ఫోన్స్ చేస్తూ నా భార్యని చూస్తూ ఏడ్చేసాను అని తెలిపారు. ఆ తర్వాత హాస్పిటల్లో చేరి రికవరీ అయినట్టు తెలిపారు రాజమౌళి.