Naatu Naatu Song : నాటు నాటు సాంగ్ షూట్ ఇండియాలో ఎందుకు చేయలేదు? రాజమౌళి ఏం చెప్పాడో తెలుసా??

తాజాగా హాలీవుడ్ వ్యానిటి మీడియాకు రాజమౌళి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో నాటు నాటు సాంగ్ ప్రస్తావన రాగా ఈ సాంగ్ ని ఇండియాలో ఎందుకు షూట్ చేయలేదు అని అడిగారు.............

Rajamouli spoke about Naatu Naatu Song in a hollywood interview

Naatu Naatu Song :  RRR సినిమా ఆస్కార్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నిలిచింది. ఇక అమెరికాలో మరిన్ని అవార్డుల ఈవెంట్స్ కి RRR యూనిట్ హాజరవుతూ, అక్కడ RRR రీ రిలీజ్ చేయడంతో ఆ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది RRR యూనిట్. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, సెంథిల్ కుమార్, మరికొంతమంది చిత్రయూనిట్ అమెరికాలో సందడి చేస్తున్నారు.

అక్కడి మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ RRR సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నారు. తాజాగా హాలీవుడ్ వ్యానిటి మీడియాకు రాజమౌళి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో నాటు నాటు సాంగ్ ప్రస్తావన రాగా ఈ సాంగ్ ని ఇండియాలో ఎందుకు షూట్ చేయలేదు అని అడిగారు. నాటు నాటు సాంగ్ ఉక్రెయిన్ లోని అధ్యక్ష భవనం ముందు షూట్ చేశారు.

దీనికి రాజమౌళి సమాధానమిస్తూ.. నాటు నాటు సాంగ్ ఇండియాలోనే షూట్ చేయాలనుకున్నాం. కానీ దానికి తగ్గ లొకేషన్ దొరకలేదు. నేను అనుకున్న లొకేషన్ కోసం చాలా వెతికాం. ఒక రాజభవనంలా ఉండాలి, బయట డ్యాన్స్ వేసేందుకు చాలా ఖాళీ ఉండాలి.. ఇలా చాలా అనుకున్నాం. సెట్ వేస్తే న్యాచురల్ గా ఉండదని రియల్ లొకేషన్ కోసమే వెతికాం. ఉక్రెయిన్ కీవ్ లోని అధ్యక్ష భవనం దొరికిన తర్వాత అక్కడ షూట్ కి పర్మిషన్ ఇస్తారో లేదో అనుకున్నాను. కానీ ఉక్రెయిన్ టీం వల్ల మాకు అది కూడా సులువైంది. అందుకు వాళ్లకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అన్నారు.

Naatu Naatu : ఆస్కార్ స్టేజి పై నాటు నాటు సాంగ్ పర్ఫామెన్స్..

ఇక నాటు నాటు పాట గురించి మరింత చెప్తూ.. డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన డ్యాన్స్ ని ఇచ్చాడు. ప్రేమ్ అంతకుముందే ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి పనిచేశాడు. వారి స్టైల్ అతనికి తెలుసు. అలాగే ఆ హీరోల అభిమానులని కూడా దృష్టిలో పెట్టుకొని కంపోజ్ చేశాడు. చరణ్, తారక్ ఇద్దరికీ చెరో స్టైల్ ఉంది. కానీ ఈ పాట కోసం ఇద్దరూ కలిసి చేశారు. ఇక నా భార్య రమా, ఆమె బృందం కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశారు. మెయిన్ లీడ్స్ తో పాటు ఈ పాటలో సైడ్ డ్యాన్స్ చేసిన వాళ్లందరికీ ఒకే కాస్ట్యూమ్ ని రెండు, మూడు తయారుచేసి ఉంచాము. ఆ పాట దుమ్ములో తీశాము. మధ్యలో సరిగ్గా రాకపోతే అప్పటికే డ్రెస్ పాడైపోయి ఉంటుంది. అందుకే ఎక్స్‌ట్రా డ్రెస్ లు పెట్టాము. కేవలం ఈ పాటని షూట్ చేయడానికి 17 రోజులు పట్టింది. చుట్టూ ఉన్న కొంతమంది డ్యాన్సర్లలో అక్కడి వాళ్లనే తీసుకున్నాం అని తెలిపాడు రాజమౌళి.