‘రంగమార్తాండ’లో రాజశేఖర్ కూతురు
‘రంగమార్తాండ’ సినిమాలో శివాత్మికా రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తోంది..

‘రంగమార్తాండ’ సినిమాలో శివాత్మికా రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తోంది..
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధానపాత్రధారులుగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. బ్రహ్మానందం డిఫరెంట్ క్యారెక్టర్ చేయనున్న ఈ సినిమాను రెడ్ బల్బ్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్, హౌస్‌ఫుల్ మూవీస్ బ్యానర్స్‌పై.. అభిషేక్ జవకర్, మధు కలిపు నిర్మించనున్నారు.
‘నటసామ్రాట్’ అనే మరాఠీ సినిమాకు ‘రంగమార్తాండ’ అఫీషియల్ రీమేక్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే విశాఖపట్నంలో ప్రారంభమైంది. ‘దొరసాని’ చిత్రం ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మికా రాజశేఖర్.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనుంది.
‘రంగమార్తాండ’ లో గాయనిగా నటిస్తున్నారట శివాత్మిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో శివాత్మిక పాల్గొంటున్నారని తెలిసింది. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తున్నారు.