Rajasekhar : రామ్‌చరణ్ సినిమాలో మిస్ అయ్యింది.. ఇప్పుడు నితిన్ సినిమాలో చేస్తున్నాడా..?

రామ్ చరణ్ సినిమాలో చేయాలని ఆశ పడిన రాజశేఖర్.. ఇప్పుడు నితిన్ సినిమాలో ఆ పాత్ర చేస్తున్నాడా..?

Rajasekhar miss that role in Ram Charan movie and now in Nithiin Extra Ordinary Man

Rajasekhar : టాలీవుడ్ యాంగ్రీ మెన్‌ గా స్టార్ హీరో ఇమేజ్ ని అందుకున్న రాజశేఖర్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మూవీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఈ సీనియర్ హీరో.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాలో నటించడానికి సిద్దమయ్యాడు. నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా సెట్స్ లోకి రాజశేఖర్ అడుగుపెట్టాడు. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేయబోతున్నాడట.

ఇక ఈ పాత్ర ఎలాంటిది అని అందరిలో ఆసక్తి నెలకుంది. రాజశేఖర్ కి విలన్ గా నటించాలని ఉందని ఎప్పటినుంచో చెబుతూ వస్తున్న మాట. గతంలో రామ్ చరణ్ ‘దృవ’ సినిమాలో విలన్ గా నటించడానికి చాలా ప్రయత్నం చేశాడు. దృవ మూవీ తమిళ్ హిట్ సినిమా ‘తని ఒరువన్’కి రీమేక్ అని అందరికి తెలిసిందే. తమిళంలో విలన్ గా నటించిన అరవింద్ స్వామినే తీసుకుంటే.. కొన్ని సీన్ రీ షూట్ చేసే పని తగ్గుతుందని, అలాగే నిర్మాణ ఖర్చు కూడా తగ్గుతుందని ప్రొడ్యూసర్స్ భావించారు.

Also read : Varun Lavanya : మొన్న మెగావారి ఇంట.. నేడు అల్లువారి ఇంట.. వరుణ్-లావణ్య ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్..

ఈ విషయాన్ని రాజశేఖరే స్వయంగా ఒక వేదిక చెప్పాడు. ఇక ‘దృవ’ సినిమాలో విలన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రాజశేఖర్.. ఇప్పుడు నితిన్ సినిమాలో ఆ తరహా పాత్రకే ఒకే చెప్పి ఉంటాడా..? అనే సందేహం నెలకుంది. కాగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ టీం రాజశేఖర్ కి సెట్స్ లో గ్రాండ్ వెల్కమ్ పలికారు. అందుకు సంబంధించిన వీడియోని నితిన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 8న రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.